Greater Hyderabad Elections 2020: హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు (GHMC Elections 2020) సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. దీంతో ఇటు తెలంగాణతోపాటు దేశంలో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ( TRS ) అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) సైతం 28న శనివారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభ (cm kcr public meeting) నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఇందులో భాగంగా గురువారం ఎల్బీ స్టేడియంలో సభా ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.
ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీ కుమార్, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, పార్టీ నేత కర్నె ప్రభాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. అయితే అంతకుముందు సీఎం కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారని వార్తలోచ్చాయి. అయితే అనుకోని కారణాల వల్ల సీఎం ప్రచారం రద్దయింది. ప్రచారంలో ప్రధాన పార్టీలన్ని మాటల తూటాలతో దూసుకెళ్తున్న వేళ.. సీఎం కేసీఆర్ బహిరంగ సభపై ప్రాధాన్యం సంతరించుకుంది. Also read: CM KCR: తెలంగాణలో మత విద్వేశాలకు కుట్ర: సీఎం కేసీఆర్
ఇదిలాఉంటే.. జీహెచ్‌ఎంసీ ( GHMC ) ఎన్నికలు డిసెంబర్ 1న జరుగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 4న వెలువడనున్నాయి. జీహెచ్ఎంసీలో మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. Also read: Swamy Goud: నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన స్వామిగౌడ్
Also read: Shobhita Rana: అందాలతో కనువిందు చేస్తున్న శోభిత రానా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe