KTR Tweet : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ మధ్య కొన్ని రోజులుగా ఓ రేంజ్ లో వార్ సాగుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. సోషల్ మీడియా వేదికగాను రచ్చ సాగుతోంది. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. దేశంలో జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ మోడీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా రూపాయి మారం విలువ మరింతగా పతనం కావడంపై తనదైన శైలిలో కేంద్ర సర్కార్ పై సెటైర్లు వేశారు కేటీఆర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయింది. శుక్రవారం రూపాయి విలువ డాలర్ తో ₹81.18 కి పడిపోయింది. రూపాయి పతనంపై  ట్విటర్‌ వేదికగా స్పందించారు మంత్రి కేటీఆర్.రూపాయి విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోయిందన్నారు కేటీఆర్. అయినా కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్‌ షాపుల్లో ప్రధాని మోడీ ఫొటో కోసం వెతుకుతున్నారని సెటైర్ వేశారు.  రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయినా..సాధారణంగానే పడిపోయిందని చెబుతున్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని.. ద్రవ్యోల్బణం దారుణ స్థితికి చేరుకుందన్నారు. ఈ అర్థిక అవరోధాలకు ‘యాక్ట్స్‌ ఆఫ్‌ గాడ్‌’ కారణమని తన ట్వీట్ లో ఆరోపించారు కేటీఆర్. ఇందుకు కారణమైన విశ్వగురువును పొగడండి అంటూ కేటీఆర్‌ సెటైర్లు వేశారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి