శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని బుద్గాంలో ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. కనిపురలో శుక్రవారం ఉదయం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదిని హతమార్చిన అనంతరం జమ్ముకశ్మీర్ పోలీస్ అధికారి ఒకరు జీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ఇటీవల మళ్లీ జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలను గుర్తించామని, తమకు అందిన సమాచారం ప్రకారం ఐఇడి బాంబులు అమర్చి ఇండియన్ ఆర్మీ సహా ఇతర భద్రతా బలగాల కాన్వాయ్‌లను పేల్చివేసే ప్రమాదం ఉందని తెలుస్తోందని అన్నారు. ఉగ్రవాదులు ఇక్కడే తలదాచుకోవడానికి కారణం ఇక్కడికి శ్రీనగర్ బైపాస్ రోడ్డు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉందని, ఆ రహదారిపైనే నిత్యం భద్రతా బలగాలు రాకపోకలు సాగిస్తాయని సదరు పోలీస్ అధికారి వెల్లడించారు. 


పుల్వామాలో కాన్వాయ్‌పై దాడి జరిపిన ఉగ్రవాదులు.. ఆ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న సంగతి తెలిసిందే.