మన దేశంలో ఎక్కువగా వినపడేది, ఎక్కువగా ప్రాచుర్యం పొందినవి రెండే రెండు.. ఒకటి క్రికెట్ అయితే మరొకటి సినిమా.. ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉంటే చాలు దేశమంత  TVలకు అతుక్కుపోతుంది. అదే ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే అభిమానులు చేసే కోలాహాలం అంత ఇంత ఉండదు. ఉదయాన్నే థియేటర్ లకు చేరుకొని గోల చేయటం, విజిల్స్ వేస్తూ హీరో సినిమాని ఎంజాయ్ చేస్తుంటారు.. ఇపుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ? ఒక విశేషం ఉందండోయ్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేంటంటే మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni), తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) లు ఒకే  ఫ్రేమ్‌లో కనిపిస్తే.. ఇంకేం ఉంది అటు క్రికెట్ ఫ్యాన్స్ విజయ్ ఫ్యాన్స్ కు పండగే. 


Also Read: విడుదలైన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్లు (AP EAMCET 2021 Hall Ticket)...ఆగష్టు 19,2021 నుండి పరీక్షలు


అయితే మొదట్లో ఒక హీరో అభిమానులు వేరే హీరో అభుమానుల మధ్య తరచుగా సోషల్ మీడియాలో, థియేటర్ల ముందు కానీ గొడవలు జరిగేవి కానీ ఈ మధ్య హీరోలు ఒకరికి ఒకరు మద్దతు తెలుపుతూ ఫంక్షన్ లలో కలవటం ద్వారా ప్రస్తుత కాలంలో అభిమానుల మధ్య గొడవలు తగ్గాయని చెప్పవచ్చు. 




ఈ విషయంలో విజయ్ మహేంద్ర సింగ్ ధోని ఇద్దరు ఇలాంటి గొడవలకు దూరంగా ఉండటమే కాకుండా, మరో క్రికెటర్ కి లేదా హీరోకి మద్దతు తెలపటంలో వీరు ముందుంటారు. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఆడే ధోనిని తమిళ ప్రజలు ముద్దుగా 'తల' అని, విజయ్‌ని 'దళపతి' అని పులుస్తుంటారు. 


 


అయితే వీరిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనపడితే ఇక అంతే.. అభిమానులకు పండగే.. తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపొయింది. ఈ ఫోటోను ధోని స్నేహితుడు సీమంత్ లోహాని  తన ఖాతాలో పోస్ట్ చేసాడు.. "క్యాప్షన్ అవసరంలే.. తలతో దళపతి.. కన్నుల పండగలా ఉంది " అంటూ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే తెగ వైరల్ అయింది. గతంలో చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai super kings) జట్టుకి విజయ్, నయనతార (Nayanthara) బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నపుడు వీరిద్దరూ  చెన్నైలోని గోకులం స్టూడియస్‌లో దిగిన ఫోటో అని తెలుస్తుంది. ఏదీ ఏమైనా మనకు నచ్చిన ఇద్దరు స్టార్లు ఒకే ఫ్రేమ్ లో ఉంటే వచ్చే కిక్కే వేరప్ప. 
Also Read: Pushpa: మామూలు మాస్ కాదండోయ్.. ఊర మాస్.. 'తగ్గేదే లే'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook