విడుదలైన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్లు (AP EAMCET 2021 Hall Ticket)...ఆగష్టు 19,2021 నుండి పరీక్షలు

ఈ రోజే విడుదలైన ఏపీ ఎంసెట్ (AP EAMCET Hall ticket 2021) పరీక్ష హాల్ టికెట్లను sche.ap.gov.in వెబ్ సైట్ లో డౌన్ లోనే చేసుకోండి

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 12, 2021, 06:22 PM IST
విడుదలైన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్లు (AP EAMCET 2021 Hall Ticket)...ఆగష్టు 19,2021 నుండి పరీక్షలు

AP EAMCET 2021 Hall Ticket Released: ఏపీ ఎంసెట్ (AP EAMCET) పరీక్ష హాల్ టికెట్లు ఈ రోజు విడుదలయ్యాయి, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్  sche.ap.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. 

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఎంసెట్ (AP EAMCET)పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోగలరు. 
Also Read: స్కూల్స్ తెరవకపోతే..ఆ ప్రమాదం పొంచి ఉందంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

కింద పేర్కొన్న సూచనల ద్వారా హాల్ టికెట్ ని డౌన్ లోన్ చేసుకోవచ్చు:

  • గూగల్ లో అధికారిక వెబ్ సైట్  sche.ap.gov.in ను తెరవండి.
  • కొత్త పేజీ ఓపెన్ అయిన తరువాత లాగ్ ఇన్ సంబంధిత ఆధారలను ఎంటర్ చేయండి
  • తరువాత మీ హాల్ టికెట్ స్క్రీన్ పై కనపడుతుంది
  • మీ హాల్ టికెట్ పై వివరాలను సరి చూసుకున్న తరువాత డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ ఎంసెట్ (AP EAMCET 2021 Hall Ticket) పరీక్షలు ఆగస్ట్ 19, 20, 23, 24 మరియు 25, 2021 న నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ మరియు పార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ లను సెప్టెంబర్ 3, 6 మరియు  7, 2021 న నిర్వచిన్చానున్నారు. 
ఏపీ ఎంసెట్ పరీక్షలను రెండు షిఫ్ట్ లుగా ఉదయం 9 గం.ల నుండి మధ్యహ్నం 12గం.ల వరకి మరియు మధ్యహ్నం 3 గం.ల నుండి సాయంత్రం 6గం.ల వరకు నిర్వహించనున్నారు. ఏపీ ఎంసెట్ పరీక్ష హాల్ టికెట్ పైన పేరు, పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ, సమయం మరియు పరీక్ష రోజు పాటించాల్సిన నియామాల గురించి తెలుపబడతాయి.
 

ఈ టెస్ట్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ మరియు ఫార్మా కాలేజీలకు ప్రవేశం కలిపించే ఈ పరీక్ష గురించి ఇతర వివరాలు తెలుసుకోటానికి అధికారిక వెబ్ సైట్ AP EAMCET సందర్శించండి. 

Also Read: భారీగా చిన్నారులకు కరోనా వైరస్, బెంగళూరులో హై అలర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News