Manmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు. 92 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ సమర్థవంతమైన రాజకీయ ప్రయాణంతో పాటు దేశంలోని అనేక ఆర్థిక సంస్కరణలకోసం ఎంతో కృషి చేశారు. మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపాన్ని అందించారు. ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు దేశాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. రెండు సార్లు భారత ప్రధానిగా ఎన్నికైన మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై కూడా ఓ సినిమా రూపొందింది. ఈ సినిమా పేరు 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. ఇందులో మన్మోహన్ సింగ్ పాత్రను అనుపమ్ ఖేర్ పోషించగా, అతని సన్నిహితుడు సంజయ్ బారు పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారు. ఈ చిత్రం కూడా సంజయ్ బారు పుస్తకం ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో 7 డైలాగులు సంచలనం రేకెత్తించాయి. ఆ డైలాగులు ఏంటో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' 11 జనవరి 2019న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది.  అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమా ద్వారా తన పరువు తీసే ప్రయత్నం జరుగుతోందని వాదించింది.  మరోవైపు ఎన్నికల వేళ వచ్చే ఈ సినిమా ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేయగలవని ఫైర్ అయ్యింది. ఎన్ని వివాదాలు ఎదురైనా ఈ చిత్రం విడుదలై అందులోని పలు డైలాగులు చర్చనీయాంశమయ్యాయి. చాలా మంది దృష్టిని ఆకర్షించిన వీటిలో ఏడు డైలాగ్‌లను ఇప్పుడు చూద్దాం. 


1. డాక్టర్ సాహెబ్ నాకు భీష్ముడిలా కనిపిస్తున్నాడు.ఎలాంటి భయం లేదు. కానీ ఫ్యామిలీ డ్రామాకు బలి అయ్యారు.


2. మహాభారతంలో రెండు కుటుంబాలు ఉండేవి. భారతదేశంలో ఒక్కటే ఉంది.


Also Read:  Manmohan Singh:  మౌనముని.. దేశ రూపురేఖలను మార్చేసిన మేధావి..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానమిదే   


3. 100 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులు నడుపుతున్నారు. వారు దేశ కథను వ్రాస్తారు.


4. పానిపట్ యుద్ధం కంటే అణు ఒప్పందం కోసం పోరాటం మాకు పెద్దది.


5. డాక్టర్‌ సాహెబ్‌ని ఎప్పుడు కుర్చీలోంచి దించుతారు. రాహుల్‌కి పాలాభిషేకం ఎప్పుడు చేస్తారు. 


6. నాకు ఎలాంటి క్రెడిట్ అక్కర్లేదు. నేను నా స్వంత వ్యాపారాన్ని చూసుకుంటాను. ఎందుకంటే నాకు దేశమే మొదటి స్థానం.


7. 'నేను రాజీనామా చేయాలనుకుంటున్నాను.' ఒకదాని తర్వాత ఒకటి అవినీతి కుంభకోణం. ఈ వాతావరణంలో రాహుల్ ఎలా బాధ్యతలు స్వీకరించగలరు?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.