J&K Terror Links: ప్రభుత్వంలో పనిచేస్తూ ఉగ్రవాదులకు సపోర్ట్‌ చేస్తున్న ముగ్గురిపై వేటు పడింది. అందులో ఓ ప్రొఫెసర్‌, టీచర్‌ తో పాటు పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉన్నారు. ఉగ్రవాదులతో సంబంధాలున్న నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం ఈ ముగ్గురిని విధుల్లోంచి తొలగించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి వ్యక్తి అల్తఫ్‌ హుస్సేన్‌ పండిట్‌:


అల్తఫ్‌ హుస్సేన్‌ పండిట్‌.. కశ్మీర్‌ యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నాడు. ఈయనకు జమాతే ఇస్లామే గ్రూప్‌ తో సంబంధాలు కమిటీ విచారణలో తేలింది. ఇతను పాకిస్తాన్‌ కు వెళ్లి కూడా శిక్షణ కూడా తీసుకున్నాడు. 1993లో అల్తఫ్‌ హుస్సేన్‌ అరెస్టు అయ్యారు. అంతకుముందు మూడు సంవత్సరాలకు వరకు జమ్ము కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ లో క్రియాశీలక ఉగ్రవాదిగా కూడా పనిచేశాడు అల్తఫ్‌ హుస్సేన్‌. ప్రస్తుతం జమాతే ఇస్లామిక్‌ గ్రూప్‌ లో యాక్టివ్‌ గా ఉంటూ.. ఉగ్రవాదులను రిక్రూట్‌ చేసుకుంటున్నాడు. 2011, 2014లో ఉగ్రవాదుల హత్యకు వ్యతిరేకంగా రాళ్లు రువ్వడం, హింసాత్మక నిరసనలు నిర్వహించడంలో అల్తఫ్‌ హుస్సేనీ కీలకపాత్ర పోషించాడు. 2015లో కశ్మీర్‌ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ లో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ గా కూడా ఈయన నియమితులయ్యాడు. విద్యార్థుల మధ్య వేర్పాటువాదాన్ని ప్రోత్సహించినట్టు అల్తఫ్‌ పై ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రవాదం వైపు విద్యార్థులు ప్రభావితం అయ్యేలా పలు కార్యక్రమాలు కూడా చేపట్టాడు.


రెండో వ్యక్తి మక్బుల్‌ హజీమ్‌:
మక్బుల్‌ హజీమ్‌. జమ్ము కశ్మీర్‌ లో ప్రభుత్వ టీచర్‌. ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో సహకరించే వ్యక్తి. ప్రజలను ఉగ్రవాదం వైపు మలిచేలా ప్రోత్సాహిస్తాడు. సోగం పోలీస్‌ స్టేషన్‌ పై జరిగిన దాడిలో ఇతనిదే కీలకపాత్రగా తేలింది.


మూడో వ్యక్తి గులాం రసూల్‌:
ఇక విధుల్లోంచి తొలగించబడ్డ మూడో అధికారి రసూల్‌. ఇతను జమ్ము కశ్మీర్‌ పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌ లో కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులకు అండర్‌ గ్రౌండ్‌ సపోర్టర్‌ గా  ఇన్‌ఫార్మర్‌గా కూడా పనిచేశాడు. అంతేకాదు ఉగ్రవాదుల ఎరివేతలో పాల్గొనే పోలీసు అధికారుల పేర్లను కూడా వారికి చేరవేస్తున్నాడని కమిటీ విచారణలో తేలింది. రసూల్‌ .. హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన మస్తక్‌ అహ్మద్‌ అలియాస్‌ ఔరంగజేబ్‌ అనే ఉగ్రవాదితో టచ్‌ లో ఉన్నట్టు తేలింది. మొత్తంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311(2) సి కింద.. ఈ ముగ్గురు ఉద్యోగులను వారి సర్వీసు నుంచి తొలగించాలని జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ప్రతిపాదించింది.


Also Read: Weight loss Tips: ఇంటిలో లభించే వాటిలో బరువును తగ్గించుకోండి..అది ఎలానో తెలుసుకోండి


Also Read: Kangana Ranaut: మహేశ్‌ బాబు చెప్పింది నిజమే.. కాంట్రవర్సీ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు: కంగనా రనౌత్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook