Private Rail: దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రైల్వేల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎలక్ట్రికల్  సర్వీసులను తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లను ప్రవేశపెట్టింది. త్వరలో వందే భాతర్ స్లీపర్‌ను కూడా తీసుకురాబోతుంది. త్వరలో దేశంలోని ముఖ్య నగరాల మధ్య వందే భారత్ మెట్రోలను ప్రవేశపెట్టబోతుంది. అటు నగరాల్లో  మెట్రో రైల్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా రైల్వేలో మరో నూతన అధ్యాయం మొదలు కాబోతుంది. దేశంలోని తొలి ప్రైవేటు రైలు సర్వీసును జూన్ 4 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళ రాష్ట్రంలోని తిరువంతపురం నుంచి గోవా మార్గంలో ఈ ప్రైవేటు రైలు తన సేవలను ప్రారంభించనుంది.
ఎస్ఆర్ఎంపీఆర్ (SRMPR) గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సర్వీసును నిర్వహించనుంది. ఈ రైలు ముఖ్య ఉద్దేశ్యం పర్యాటకులను ఆకర్షించడం. భారత్ గౌరవ్ యాత్రలో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సిపల్ వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్తంగా ఈ ప్రైవేటు రైల్వే సంస్థను నిర్వహించనున్నట్టు తెలిపారు.


ఈ రైలు తిరువనంతపురం నుంచి గోవా రూట్లో త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం (కొచ్చి), త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్ గోడ్ సహా పలు రైల్వే స్టేషన్స్‌లలో ఈ రైలు ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలులో 750 మంది ప్రయాణికులు ఏక కాలంలో ప్రయాణం చేయోచ్చు. ఇందులో 2 స్లీపర్ కోచ్‌లు.. 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లు.. 2 సెకండ్ క్లాస్ ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇందులో డాక్టర్స్‌తో పాటు 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇందులో భోజనంతో పాటు వైఫై నెట్‌వర్క్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటాయట.  ఇందులో స్టార్ హోటల్ వసతితో పాటు భోజన సౌకర్యాలతో పాటు ప్రముఖ టూరిస్ట్ స్పాట్స్ మీదుగా
ఈ టూర్ ప్యాకేజీ ఉండబోతుంది.


ఇదీ చదవండి: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter