బంగారం ఢమాల్.. భారీగా పెరిగిన వెండి ధరలు
బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు దిగొచ్చాయి. దాదాపు 8 రోజుల అనంతరం పసిడి ధరలు క్షీణించాయి. మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగాయి.
బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు దిగొచ్చాయి. దాదాపు 8 రోజుల అనంతరం పసిడి ధరలు క్షీణించాయి. మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగాయి. స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, డాలర్ మారకం ధర, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. కోవిడ్19 యాప్ లాంచ్ చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇక వివరాలు మీ చేతుల్లో!
హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.490 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,700కి చేరుకుంది. 22 క్యారెట్లపై రూ.470 తగ్గింది. బంగారం 10 గ్రాముల ధర రూ.43,950కి దిగొచ్చింది. లిప్ లాక్, బెడ్రూమ్ సీన్లపై స్పందించిన రాశీ ఖన్నా
నేడు ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.520 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,500కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.590 క్షీణించింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,750 వద్ద ర్యాలీ అవుతోంది. Pics: క్యాలెండర్ గాళ్ సొగసు చూడతరమా!
గత రెండు రోజులు దిగొచ్చిన వెండి ధరలు నేటి మార్కెట్‌లో వరుసగా రెండోరోజూ పెరిగాయి. నిన్న మార్కెట్‌లో రూ.10మేర పెరిగిన వెండి నేడు రూ1,010 ఎగబాకింది. దీంతో కిలో వెండి ధర రూ.42,520 అయింది. దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!