బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) మరోసారి తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా నాలుగురోజులు తగ్గిన ధరలు అమాంతరం పెరిగాయి. శనివారం సాయంత్రానికి మళ్లీ పసిడి దిగొచ్చాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి స్వల్పంగా ధర దిగొచ్చింది. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.230 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,140 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.250 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.47,800కి పడిపోయింది. 



దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) మళ్లీ తగ్గాయి.  తాజాగా రూ.230 మేర స్వల్పంగా ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,140కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,800కి క్షణీంచింది. 



వెండి ధర (Silver Rate in India) వారం మొత్తం తగ్గిన ధర వారాంతంలోనూ అదే రిపీట్ చేసింది. తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ.300 మేర స్వల్పంగా తగ్గింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.59,000కి దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా వెండి ఒకే ధరతో మార్కెట్ అవుతోంది.  



ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G