Gold Rate In Hyderabad: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి
బులియన్ మార్కెట్‌లో మార్చి 24న బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో జనతా కర్ఫ్యూ, పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్‌లు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో జనతా కర్ఫ్యూ, పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్‌లు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. జ్యువెలర్ల విక్రయాలు లేకపోవడం, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ లేని పరిస్థితుల్లో నేటి (మార్చి 24న) బులియన్ మార్కెట్ ప్రారంభమైంది. బంగారం ధరలు స్వల్పంగా పెరిగినా.. వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి. హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos
హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో మంగళవారం బంగారం ధర రూ.30 మేర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.43,310కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.39,700 అయింది. ఆంటీ అని పోస్ట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యాంకర్
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. బంగారం ధర కేవలం రూ.40 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.41,750కి చేరుకుంది. కాగా, 22 క్యారెట్ల బంగారం ధర సైతం అంతే పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40,550కి జంప్ అయింది. బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone
కాగా, బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగినా వెండి ధర భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శనివారం 1 కేజీ వెండి రూ.670మేర తగ్గడంతో నలభై వేల మార్కు కిందకి దిగొచ్చింది. దీంతో 1కేజీ వెండి ధర రూ.39,880 అయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర రూ.39,880గా ట్రేడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..