జాతీయ రహదారుల్లో ఈ రోజు అర్థరాత్రి నుండి టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 5 శాతాన్ని 7 శాతంగా మార్చనున్నట్లు తెలిపింది. అన్ని రకాల వాహనాలపై కూడా ఈ ఛార్జీలు పెరగనున్నాయి. అయితే ఈ టోల్ ఛార్జీలు పెరగడం వల్ల వాహనాలకే కాక, వస్తు రవాణా వ్యవస్థకు కూడా నడ్డి విరిగే అవకాశం ఉందని.. ఈ క్రమంలో నిత్యవసర సరకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని పలువురు ఆర్థిక నిపుణులు అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 372 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటి ధరలు ఆర్థిక సంవత్సరం ప్రారంభమవ్వడానికి ముందే నిర్ణయించడం జరుగుతుంది. అయితే ప్రాంతాలను బట్టి కూడా ఈ ధరలు మారే అవకాశం ఉంటుంది. అయితే నేషనల్ హైవేల విషయానికి వస్తే.. ఇప్పటికే టోల్ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారని.. ఈ క్రమంలో మళ్లీ రేట్లు పెంచడమంటే ట్రాన్సపోర్టర్ల నడ్డి విరవడమే అని పలువురు వాపోతున్నారు.


ఇప్పటికే ఇ-వే బిల్లులు పెంచడమే కాకుండా.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ప్రభుత్వం పెంచిందని.. ఈ క్రమంలో టోల్ ఛార్జీలు కూడా పెంచితే.. రవాణా వ్యవస్థలో పనిచేసేవారి ఖర్చులు పెరుగుతాయని అంటున్నారు.