Tomato Flu:  దేశంలో టొమాటో ఫ్లూ కలవర పెడుతోంది. కేరళ, ఒడిశాలో టెర్రర్ పుట్టిస్తోంది. ఇప్పటివరకు కేరళలో 82 మంది చిన్నారులకు వ్యాధి సోకింది. ఒడిశాలో 26 మందికి టొమాటో ఫ్లూ వ్యాధి సోకినట్లు గుర్తించారు. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్(HFMD)గా ఈవ్యాధి పిలుస్తారు. టొమాటో ఫ్లూపై ది లాన్సెట్ జర్నల్‌ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈఏడాది మే 6 నుంచి ఇప్పటివరకు కేరళలో 82 మంది టొమాటో ఫ్లూ బారినపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాధితులంతా ఐదేళ్లలోపు చిన్నారులుగా గుర్తించారు. దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ బెల్స్ మోగిస్తున్న సమయంలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. కేరళలో పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో సమీప రాష్ట్రాలు తమిళనాడు, కర్నాటక అప్రమత్తమయ్యాయి. ఒడిశాలోనూ కలకలం రేపుతోంది. 26 మంది చిన్నారుల్లో ఎక్కువ మంది 9 ఏళ్ల లోపు వారే ఉన్నారు. ఈవ్యాధిని భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం గుర్తించింది.


కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో కలిపి మొత్తం కేసులు 108గా ఉన్నాయి. టొమాటో ఫ్లూ ప్రభావం ఇతర రాష్ట్రాల్లో లేదని ది లాన్సెట్ జర్నల్‌ తెలిపింది. పేగు సంబంధిత వ్యాధి కారణంగా టొమాటో ఫ్లూ సోకుతుందని..ఇది ఓ అంటు వ్యాధిగా గుర్తించారు. ఈవ్యాధి అధికంగా చిన్నారుల్లో కనిపించనుంది. యువకులకు ఈవ్యాధి సోకే పరిస్థితి లేదని..వారికి రోగనిరోధన శక్తి అధికంగా ఉంటుందని ది లాన్సెట్ జర్నల్‌ వెల్లడించింది.


టొమాటో ఫ్లూ సోకిన వారిలో జ్వరం, నోట్లో పుండ్లు, చేతులు, కాళ్లు, పిరుదులపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉండనున్నాయి. శరీరంపై ఎర్రగా నీటి బుడగల్లాగా ఏర్పడి..టొమాటో పరిమాణంలా ఏర్పడనుంది. అందుకే వైద్యులు దీనికి టొమాటో ఫ్లూ నామకరణం చేశారు. మరోవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 13 వేల 272 మందిలో వైరస్‌ బయట పడింది. కోవిడ్ కారణంగా 36 మంది మృత్యువాత పడ్డారు.


ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల 43 లక్షల 27 వేల 890కి చేరింది. ఇటు 5 లక్షల 27 వేల 289 మంది మృతి చెందారు. నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త కేసులు తగ్గినా కరోనా కలవరం పుట్టిస్తోంది. దేశంలో ప్రస్తుతం లక్షా వెయ్యి 166 క్రియాశీల కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.23 శాతంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు 13 వేల 900 మంది కరోనా నుంచి కోలుకుని వారియర్‌గా నిలిచారు.


Also read:CM Kcr: ఈడీకి దొంగలు భయపడతారు..నేను ఎందుకు భయపడతా..సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్..!


Also read:Pawan Kalyan: పద్యం పుట్టిన నేలలో మద్యం ప్రవహిస్తోంది..వైసీపీపై పవన్ కళ్యాణ్ ఫైర్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook