Pawan Kalyan: వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పద్యం పుట్టిన నేలలో మద్యం ప్రవహిస్తోందన్నారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు కడప జిల్లాలో 190 మంది కౌలు రైతులు చనిపోయారని గుర్తు చేశారు. బాధిత కౌలు రైతులు అధికంగా రెడ్లే ఉన్నారని చెప్పారు. కుల రాజకీయాలు చేసేందుకు జనసేన స్థాపించలేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదన్నారు. వైఎస్ జగన్ ..వైసీపీకి సీఎం అని..ఏపీకి కాదని మండిపడ్డారు. నేను పదవులు ఆశించి పార్టీ స్థాపించలేదని..తాను కోరుకున్నది మార్పు మాత్రమేనని స్పష్టం చేశారు. వైసీపీలో ఇప్పుడున్న నేతలే ఆనాడు అన్నయ్య పార్టీని విలీనం చేయించారని..ఆ పార్టీ ఇప్పుడు ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు పవన్ కళ్యాణ్.
2018లో సీమకు చెందిన అనేక మంది పెద్దలను కలిశానని..ఎవరి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. ఏపీలో వారసత్వ రాజకీయాల్లో మార్పు రావాలని పిలుపునిచ్చారు. కులం, మతాలపై రాజకీయాలు సరికాదని..తాను ఎప్పుడూ కుల మతాల గురించి ఆలోచించని స్పష్టం చేశారు. రాయలసీమలో 60 వేల మంది కౌలు రైతులు ఉన్నారని..వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు పవన్ కళ్యాణ్.
మైదుకూరులో ఓ వికలాంగుడిని వైసీపీ నేతలు బెదిరించడం సిగ్గు చేటు అని అన్నారు. మైదుకూరుకు చెందిన నాగేంద్రకు జనసేన అండగా ఉంటుందన్నారు. సొంత చెల్లెలు షర్మిలను సీఎం జగన్ పక్కన పెట్టారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితులను ఎందుకు పట్టించుకోలేదన్నారు. కోడి కత్తి దాడి జరిగితే ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్..ఇప్పుడు ఏపీ సీఎం ఎలా అయ్యారని మండిపడ్డారు.
ఇడుపులపాయలో వేల ఎకరాలు జగన్‌కు ఉన్నాయని..రాయలసీమలో మార్పు జరగాలంటే మార్పులు రావాలని స్పష్టం చేశారు. కేంద్రం మెడలు వంచుతామన్న వైసీపీ ఎంపీలు అక్కడికి వెళ్లి మొకరిల్లుతున్నారని విమర్శించారు పవన్ కళ్యాణ్.
Also read:Rahul Gandhi: కాంగ్రెస్‌లో కథ మొదటికి..తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ..!
Also read:KCR Munugode Meeting: ఈడీ, బోడీలకు పెట్టుకో..ఏం పీక్కుంటావో పీక్కో..మోదీపై కేసీఆర్ ధ్వజం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook