రాంపూర్ వద్ద పట్టాలు తప్పిన రైలు
రాంపూర్ వద్ద పట్టాలు తప్పిన రైలు
రాంపూర్: ఉత్తర ప్రదేశ్‌లోని దమోరా, దుగ్గన్ స్టేషన్ల మధ్య బుధవారం అర్థరాత్రి ఖాళీ బోగీలతో వెళ్తున్న ఓ రైలు పట్టాలు తప్పింది. రైలులోని ఆరు బోగీలు పక్కకు ఒరిగాయని.. అయితే అదృష్టవశాత్తుగా అది ఖాళీ రైలు కావడంతో అందులో ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని సంబంధిత రైల్వే అధికారవర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలోని డౌన్ లైన్ స్తంభించింది. మొరాదాబాద్, బరేలీ జంక్షన్ల మధ్య నడిచే రైళ్లను మొరాదాబాద్-చాందౌసి-బరేలీ మార్గంలో మళ్లిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో ప్రయాణిస్తున్న 17 రైళ్లపై ప్రభావం పడింది. అందులో కొన్ని రైళ్లు మధ్యలోనే నిలిపేయగా.. ఇంకొన్ని రైళ్లను మార్గం మళ్లించారు.