BJP MLA Porn Watching Porn Video: ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన ఎమ్మెల్యేలు దారి తప్పుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనే పోర్న్ వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే శాసనసభ సమావేశాల్లో అశ్లీల వీడియోలు చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ త్రిపురలో విజయం సాధించి.. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం బడ్డెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. బగ్‌బాసా అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే జాదబ్ లాల్ నాథ్ తన ఫోన్‌లో వీడియోలు చూస్తూ కనిపించాడు. కెమెరాను జూమ్ చేయగా.. అవి పోర్న్ వీడియోలుగా తేలింది. స్పీకర్, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే వీడియోలు చూడగా.. వెనుక నుంచి వీడియో తీశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


 




 
ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. ఎమ్మెల్యేను వివరణ కోరుతూ.. నోటిసులు పంపించింది. ఈ వీడియోపై ఎమ్మెల్యే ఇంకా స్పందించలేదు. సభ ముగిసిన వెంటనే ఆయన అసెంబ్లీ ప్రాంగణం నుంచి వెళ్లిపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీపీఎంకు కంచుకోటగా పేరొందిన బగ్‌బాసా అసెంబ్లీ నియోజకవర్గంలో జాదబ్ లాల్ నాథ్ బీజేపీ విజయపతాకాన్ని ఎగురవేశారు. 2018 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి బిజితా నాథ్ బీజేపీ అభ్యర్థి ప్రదీప్ కుమార్ నాథ్‌పై 270 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో జాదబ్ లాల్ నాథ్‌ 1400 ఓట్ల తేడాతో గెలుపొందారు. 


బహిరంగ ప్రదేశంలో పోర్న్ చూస్తూ ఓ బీజేపీ నేత పట్టుబడడం ఇదే తొలిసారి కాదు. 2012లో కర్ణాటకలోని అప్పటి బీజేపీ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రులు రాష్ట్ర అసెంబ్లీలో తమ ఫోన్‌లలో పోర్న్ క్లిప్‌లు చూడటం చూస్తూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరు రాజీనామా చేశారు. అయితే మంత్రులు లక్ష్మణ్ సవాది, సీసీ పాటిల్ ఏ తప్పు చేయలేదని విచారణలో తేలడంతో పార్టీ తిరిగి చేర్చుకుంది. 


Also Read: IPL 2023: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదించిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..!  


Also Read: Coronavirus Cases Today: కరోనా అలర్ట్.. నేడు భారీగా కేసులు నమోదు   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook