Twins Died: పాము ఎంగిలి చేసిన పాలు తాగి కవల చిన్నారులు మృతి
పాము ఎంగిలి చేసిన పాలు తాగిన పాలు తాగిన కొద్దిసేపటికే ఇద్దరు కవల బాలికలు మృతి ( Twin Girls Drank Poisonous Milk And Died) చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో విషాదాన్ని నింపింది. స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
పాము ఎంగిలి చేసిన పాలు తాగిన ఇద్దరు కవలలు కొద్దిసేపటికే మృతిచెందారు (Twin Girls Drank Poisonous Milk And Died). ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ పరిధిలో ఈ విషాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు సైతం కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసుల కథనం ప్రకారం.. మర్ద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోట్నామర్ద్ గ్రామంలో ఇద్దరు కవల చిన్నారులు (బాలికలు)తో తండ్రి నివాసం ఉంటున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో ఆకలి కావడంతో చిన్నారులు ఏడుస్తున్నారు.. Kotamreddy Sridhar Reddy: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
పిల్లల ఏడుపు విన్న తండ్రి వెంటనే లేచి పాలు తెచ్చి చిన్నారులకు ఇచ్చాడు. పాలు తాగిన కొద్దిసేపటికే చిన్నారుల నోటి నుంచి నురగలు రావడంతో ఆందోళన చెందిన తండ్రి కవలలను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బాలికలను పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు చనిపోయారని చెప్పేసరికి ఆ తండ్రికి గుండె పగిలినంత పనైంది. విషం కలిసిన పాలు తాగడంతో పిల్లు చనిపోయి ఉంటారని వైద్యులు చెప్పారు. ఇంటికి వెళ్లి మొత్తం వెతకగా.. ఓ మూలన పాము ఉండటం గమనించారు. పాము తాగిన పాలు విషపూరితం కావడంతో చిన్నారులు చనిపోయి ఉండొచ్చునని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trent Boult breaks a stump: ఐపీఎల్ ప్రాక్టీస్‌లో వికెట్లు విరుగుతున్నాయి..
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR