UCO Bank Recruitment 2020:  బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న అతిపెద్ద బ్యాంక్ యూకో బ్యాంకు  (UCO Bank Jobs 2020)పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. 



 


రాత పరీక్ష, అందులో ఎంపికైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి పోస్టులను భర్తీ చేయనున్నారు. తగిన అర్హతలతో పాటు ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పలు కేటగిరీలలో మొత్తం 91 పోస్టులను స్కేల్ 1, స్కేల్ 2 విభాగాలుగా భర్తీ చేస్తున్నారు.  Also Read : SBI Clerk Mains Hall Ticket 2020: ఎస్‌బీఐ ‘క్లర్క్’ మెయిన్స్ హాల్‌ టికెట్లు విడుదల


 


మొత్తం 91 పోస్టుల వివరాలు..


  • ఛార్టెర్డ్ అకౌంటెంట్స్/ సీఎఫ్‌ఏ: 50


  • ఐటీ ఆఫీస‌ర్: 20


  • సెక్యూరిటీ ఆఫీస‌ర్స్: 09


  • ఇంజినీర్స్: 08


  • ఎక‌ననామిస్ట్‌: 02


  • స్టాటిస్టీసియన్: 02



దరఖాస్తు చేసుకునేందుకు క్లిక్ చేయండి


నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు..


  • ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 27


  • ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు తుది గడువు: నవంబర్ 17


  • రాతపరీక్ష: డిసెంబరు 2020 లేక జనవరి 2021లో ఉంటుంది.



యూకో బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (UCO Official Website)
 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe