Udaipur Killing: ఇండియాలోనూ హిందువులకు రక్షణ లేదు.. ఉదయ్‌పూర్ దర్జీ హత్యపై రచయిత్రి తస్లీమా నస్రీన్ రియాక్షన్..
Udaipur Tailor Killing: ఉదయ్‌పూర్‌లో జరిగిన అరాచకం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపుతోంది. దర్జీ హత్యను సామాన్యులు మొదలు ప్రముఖుల వరకు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు.
Udaipur Tailor Killing: రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కన్హయ్య అనే దర్జీ దారుణ హత్య దేశాన్ని షాక్‌కి గురిచేసింది.రియాజ్ అఖ్తారీ, మహమ్మద్ గౌస్ అనే ఇద్దరు వ్యక్తులు కన్హయ్యను పట్టపగలే నరికి చంపి.. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు, నరేంద్ర మోదీకి కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన నుపుర్ శర్మకు కన్హయ్య మద్దతుగా నిలిచాడు. నుపుర్ శర్మకు మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో అతను చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం చెంది రియాజ్, గౌస్‌లు ఈ హత్యకు పాల్పడినట్లు వీడియోలో వెల్లడించారు.
ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ అరాచకం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా సామాన్యులు ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. తాజాగా ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఈ ఘటనపై ట్విట్టర్‌లో స్పందించారు. ఇండియాలోనూ హిందువులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.
'ఉదయ్‌పూర్ హత్య ఘటన తర్వాత హంతకులు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.చంపింది తామేనని సంతోషంగా ప్రకటించారు. మహమ్మద్ ప్రవక్త కోసం ఎంతకైనా తెగిస్తామని ప్రకటించుకున్నారు. ఇలాంటి మతోన్మాదులు చాలా ప్రమాదకరం. ఇండియాలోనూ హిందువులకు రక్షణ లేకుండా పోయింది.' అంటూ తస్లీమా నస్రీన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌కి చెందిన రచయిత్రి తస్లీమా నస్రీన్ ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. 1993లో ఆమె రాసిన 'లజ్జ' నవల స్వదేశంలో తీవ్ర ప్రకంపనలు రేపింది. భారత్‌లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను తస్లీమా లజ్జ నవల రూపంలో ప్రపంచానికి తెలియజేశారు. ఆ సమయంలో బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు జరిపిన దాడుల్లో హిందూ కుటుంబాలు ఎదుర్కొన్న దారుణ పరిస్థితులను నవలలో కళ్లకు కట్టారు. ఈ నవలపై బంగ్లాదేశ్‌లో నిషేధం విధించగా.. తస్లీమాను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో విదేశాలకు పారిపోయిన తస్లీమా.. కొన్నేళ్ల తర్వాత ఇండియా వచ్చి ఇక్కడే ఉంటున్నారు. మతోన్మాద ఘటనలపై తస్లీమా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజా ఉదయ్‌పూర్ హత్య ఘటనపై తస్లీమా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read: Udaipur Murder Updates: ఉదయ్ పూర్ హత్య ఘటనతో దేశమంతా హై అలర్ట్..దోషులను శిక్షించాలన్న రాహుల్ గాంధీ
Also Read: Meena Husband Death: విషాదం.. నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.