Threaten to Modi: మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం మళ్లీ రాజుకుంది. ఉదయ్‌పూర్‌లో ఓ వ్యక్తిని దారుణంగా చంపడమే కాకుండా..ప్రధాని మోదీని బెదిరిస్తూ వీడియో విడుదల చేశారు.
రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల వివాదం రాజుకుంది. నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశాడనే కారణంతో ఉదయ్‌పూర్‌లోని ఒక టైలర్ కన్హయ్యా లాల్‌ను..పట్టపగలు అందరూ చూస్తుండగా..అతని షాపులో చొరబడి కత్తులతో నరికి చంపారు. అంతేకాకుండా ఈ ఘటనంతా వీడియో తీసి వైరల్ చేస్తున్నారు.
ఇదే వీడియోలో నిందితులు ప్రదాని నరేంద్ర మోదీని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారు. తమ కత్తులు ప్రధాని మోదీని కూడా చేరుకోగలవంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఉదయ్‌పూర్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఓ వీధిలో కన్హయ్యా లాల్ టైలరింగ్ షాపుంది. అతని షాపులో చొరబడి చంపి..అదంతా వీడియో షూట్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నగరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నిందితుడికి గుణపాఠం చెప్పామంటూ వీడియో పోస్టా్ చేశారు. అత్యంత పదునైన కత్తులతో ఈ దాడి జరిగింది. తాలిబన్ స్టైల్ మర్డర్‌గా భావిస్తున్నారు.
ఉదయ్‌పూర్ హత్య వార్త నగరమంతా దావాలంలా వ్యాపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు నిందితులు విడుదల చేసిన వీడియో వైరల్ అవుతూ మరింత వివాదాస్పదమవుతోంది. మా దేవుడిని అగౌరవపర్చినందుకు నేను అతడికి గుణపాఠం చెప్పడం పూర్తయ్యాక..ఈ వీడియోను వైరల్ చేస్తానని నిందితుల్లో ఒకడు వ్యాఖ్యలు చేశాడు.
ప్రధానికి మోదీకు బెదిరింపు
ఇదే వీడియోలో ఇద్దరు హంతకులు ప్రధాని నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో నేరుగా బెదిరించారు. తమ ఈ కత్తులు ప్రధాని మోదీని కూడా చేరుకోగలవంటూ హెచ్చరించారు. పదిరోజుల ముందే హత్యకు నిందితులు రెక్కీ చేసినట్టు పోలీసులు తెలిపారు. అదే సమయంలో టైలర్ కన్హయ్యా లాల్‌కు బెదిరింపులు కూడా వచ్చినట్టు చెప్పారు.
It's a sad & shameful incident. There's tense atmosphere in the nation today. Why don't PM & Amit Shah ji address the nation? There is tension among people. PM should address the public&say that such violence won't be tolerated & appeal for peace: Rajasthan CM on Udaipur murder pic.twitter.com/rkX0VRJPk0
— ANI (@ANI) June 28, 2022
మరోవైపు ఈ ఘటనను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా ఖండించారు. నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని..ఇదేమీ చిన్న ఘటన కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని..నిందితుల్ని వెంటనే అరెస్టు చేస్తామని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు నగరంలో 24 గంటలవరకూ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి