Meena Husband Death: విషాదం.. నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం..

Meena Husband Vidyasagar Death: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి మీనా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మీనా భర్త పోస్ట్ కోవిడ్ సమస్యలతో హఠాన్మరణం చెందారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jun 29, 2022, 06:34 AM IST
  • నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
  • ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న విద్యాసాగర్
  • పోస్ట్ కోవిడ్ సమస్యలతో మరింత క్షీణించిన ఆరోగ్యం
Meena Husband Death: విషాదం.. నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం..

Meena Husband Vidyasagar Death: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విద్యాసాగర్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

విద్యాసాగర్ కొన్నేళ్లుగా తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. పావురాల వ్యర్థాల నుంచి సోకిన గాలిని పీల్చడం ద్వారా అతను ఇన్ఫెక్షన్ బారినపడ్డాడు. అప్పటినుంచి ఇందుకు చికిత్స తీసుకుంటున్నాడు. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నందునా ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అయితే ట్రాన్స్‌ప్లాంట్ కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి అవయవ దానం కోరేవారి లిస్టు పెద్దదిగా ఉండటంతో విద్యాసాగర్‌కు సకాలంలో ఊపిరితిత్తుల మార్పిడి చేయలేకపోయారు. దీంతో కొన్నాళ్లుగా మెడిసిన్స్ తీసుకుంటూ నెట్టుకొస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో విద్యాసాగర్, మీనా, వారి కుమార్తె కరోనా బారినపడ్డారు. కరోనా తర్వాత విద్యాసాగర్ ఆరోగ్యం మరింత క్షీణించింది. పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆయన తీవ్రంగా జబ్బు పడ్డారు. మంగళవారం (జూన్ 28) ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యాసాగర్ తుది శ్వాస విడిచారు. 

విద్యాసాగర్ హఠాన్మరణంతో నటి మీనా కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మీనా అభిమానులు ఈ వార్త తెలిసి షాక్‌కి గురవుతున్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మీనా భర్త మృతిపై సంతాపం ప్రకటించారు.

కాగా, నటి మీనా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి నైనికా అనే కుమార్తె ఉంది. నైనికా చిన్నతనంలోనే సినీ ఎంట్రీ ఇచ్చింది. తళపతి విజయ్ నటించిన 'థేరీ' సినిమాలో నైనికా బాల నటిగా మెరిసింది.

Also Read: Chiru with PM Modi: ప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి

Also Read: Threaten to Modi: ప్రధాని మోదీని బెదిరించిన ఉదయ్‌పూర్ హంతకులు, వీడియో విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News