Udaipur Beheaded Case: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో పట్టపగలే టైలర్ ను ఇద్దరు దుండగులు తల నరికి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. రాజ్ స్థాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రాజస్థాన్ లో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. ఉదయ్ పూర్ లో కర్ఫ్యూ పెట్టారు. వారం రోజుల పాటు ఇంటర్ నెట్ సేవలపై బ్యాన్ విధించారు. ఘటన జరిగిన ఉదయ్ పూర్ తో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. కేంద్ర హోంశాఖ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది.
ఉదయ్ పూర్ ఘటనను కాంగ్రెస్ అగ్ర నేతలు తీవ్రంగా ఖండించారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన దారుణ హత్యతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని రాహల్ గాంధీ ట్వీట్ చేశారు. మతం పేరుతో చేసే క్రూరత్వాన్ని సహించలేమన్నారు. ఈ క్రూరత్వానికి పాల్పడి జనాలను భయాందోళనలను గురి చేసిన వారిని వెంటనే శిక్షించాలని అన్నారు. ప్రజలంతా కలిసి సమిష్టిగా ద్వేషాన్ని ఓడిద్దామన్నారు. దేశ ప్రజలంతా సంయమనం పాటించాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. సోదరభావంతో మెలుగుదామని పిలుపిచ్చారు.
उदयपुर में हुई जघन्य हत्या से मैं बेहद स्तब्ध हूं।
धर्म के नाम पर बर्बरता बर्दाश्त नहीं की जा सकती। इस हैवानियत से आतंक फैलाने वालों को तुरंत सख़्त सज़ा मिले।
हम सभी को साथ मिलकर नफ़रत को हराना है। मेरी सभी से अपील है, कृपया शांति और भाईचारा बनाए रखें।
— Rahul Gandhi (@RahulGandhi) June 28, 2022
ఉదయ్ పూర్ లో జరిగిన ఘటన అత్యంత దారుణమన్నారు ప్రియాంక గాంధీ. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. మతం పేరుతో ద్వేషాన్ని, ద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేసే వాళ్లతో మన దేశానికి, సమాజానికి ప్రాణాంతకం అని ప్రియాంక ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి. అహింస కోసం ప్రజలమంతా కలిసి పనిచేద్దామని ప్రియాంక గాంధీ అన్నారు.
उदयपुर में घटी हिंसक घटना की जितनी निंदा की जाए उतनी कम है। दोषियों को सख्त से सख्त सजा मिलनी चाहिए।
धर्म के नाम पर नफरत, घृणा व हिंसा फैलाने वाले मंसूबे हमारे देश व समाज के लिए घातक हैं।
हमें मिलकर शांति व अहिंसा के प्रयासों को मजबूत करना होगा।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 28, 2022
ఉదయ్‌పూర్‌లో జరిగిన ఘటన చాలా బాధాకరమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. మతం పేరుతో ఇలా ఒకరిని చంపడం చాలా బాధాకరం, అవమానకరం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయ్ పూర్ ఘటనతో దేశ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడుతున్నారని చెప్పిన అశోక్ గెహ్లాట్.. జనాలు సంయమనం పాటించాలని కోరారు. కేసు విచారణను అత్యంత వేగంగా జరుపుతామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టైలర్ హత్యకు సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దని ప్రజలను కోరారు. అందరూ శాంతియుతంగా ఉండాలని సూచించారు.
अगर हम लोग कुछ बोलते हैं, अपील करते हैं तो फर्क पड़ता है, पीएम बोलते हैं तब ज्यादा फर्क पड़ता है। मेरा मानना है कि पीएम को पूरे देश को संबोधित करना चाहिए,अपील करनी चाहिए कि हम किसी कीमत पर हिंसा को बर्दाश्त नहीं करेंगे और प्रेम-भाईचारे से रहो सब आपस में, ये कहने में क्या हर्ज है।
— Ashok Gehlot (@ashokgehlot51) June 28, 2022
Read Also: Anti Modi Flexi: హైదరాబాద్ లో కలకలం.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
Read Also: Dil Raju Son: మరోసారి తండ్రైన దిల్ రాజు.. వారసుడు వచ్చేశాడుగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి