Fake universities list: 24 నకిలీ విశ్వవిద్యాలయాలను గుర్తించిన యూజీసీ
దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో 24 నకిలీ విశ్వవిద్యాలయాలు ( fake universities ) ఉన్నట్టు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ( UGC ) గుర్తించింది. యూజీసీ వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్‌లోనే ( Uttar Pradesh ) అత్యధికంగా 8 ఫేక్ యూనివర్శిటీలు ఉన్నట్టు తేలింది. ఆయా ఫేక్ యూనివర్శిటీలకు డిగ్రీలు ఇచ్చే ( UGC Secretary Rajnish Jain ) అర్హత కూడా లేదని, అవి ఇచ్చే డిగ్రీలు చెల్లవని యూజీసీ కార్యదర్శి రజనిష్ జైన్ తెలిపారు.
న్యూ ఢిల్లీ: దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో 24 నకిలీ విశ్వవిద్యాలయాలు ( fake universities ) ఉన్నట్టు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ( UGC ) గుర్తించింది. యూజీసీ వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్‌లోనే ( Uttar Pradesh ) అత్యధికంగా 8 ఫేక్ యూనివర్శిటీలు ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత ఢిల్లీలో ఏడు, ఒడిషాలో రెండు, పశ్చిమ బెంగాల్‌లో రెండు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో యూనివర్శిటీ నకిలీవి ఉన్నట్టు యూజీసి స్పష్టంచేసింది. ఏయే రాష్ట్రంలో ఏయే విశ్వవిద్యాలయాలకు అనుమతి లేకుండా కార్యకలాపాలు అందిస్తున్నాయనే వివరాలతో కూడిన జాబితాను యూజీసీ ( University Grants Commission ) విడుదల చేసింది. Also read : US H-1B Visa Rules: మరింత కఠినంగా హెచ్1బీ వీసా కొత్త రూల్స్
విశ్వవిద్యాలయాలుగా చెలామణి అవుతున్న ఈ 24 విద్యా సంస్థలకు యూజీసీ నుంచి అనుమతులు లేవని సంబంధిత విభాగం పరిశీలనలో తేలింది. ఈ 24 విద్యా సంస్థలను విశ్వవిద్యాలయాలుగా పరిగణించడం లేదని.. ఆయా ఫేక్ యూనివర్శిటీలకు డిగ్రీలు ఇచ్చే ( UGC Secretary Rajnish Jain ) అర్హత కూడా లేదని, అవి ఇచ్చే డిగ్రీలు చెల్లవని యూజీసీ కార్యదర్శి రజనిష్ జైన్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe