UGC NET Exam 2024 Schedule Revised: యూజిసి నెట్ 2024 పరీక్షకు సిద్ధమౌతున్న అభ్యర్ధులకు ముఖ్య గమనిక. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష తేదీల్లో స్వల్పంగా మార్పు చేసింది. శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకే ఆగస్టు 26న నిర్వహించాల్సిన పరీక్షను ఆగస్టు 27న నిర్వహించనుంది. యూజిసి నెట్ 2024 రివైజ్డ్‌ షెడ్యూల్ ఇలా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే యూజిసి నెట్ 2024 పరీక్షను ప్రతి ఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈసారి యూజిసి నెట్ పరీక్షల్ని ఆగస్టు 2, 22, 23,26,28,29,30 తేదీలతో పాటు సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో జరగాల్సి ఉన్నాయి. కానీ ఆగస్టు 26వ తేదీన శ్రీ కృష్ణ జన్మాష్టమి కారణంగా సెలవు రావడంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నారు. మిగిలిన పరీక్షలో తేదీల్లో ఎలాంటి మార్పులు లేవు. 


దేశవ్యాప్తంగా యూజిసి నెట్ 2024 పరీక్షలు 83 విభాగాల్లో జరగనున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డు, యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం , పీహెచ్‌డి ఎంట్రీ కోసం ఈ పరీక్ష జరుగుతుంది. ఏడాదికి రెండు సార్లు ఈ పరీక్ష జరుగుతుంది. 


Also read: VI Independence Day Offer: వోడాఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్, ఈ ప్లాన్స్‌‌తో అమెజాన్, హాట్‌స్టార్ ఉచితం


జూన్ 18 రద్దయిన పరీక్ష ఈసారి ఆన్‌లైన్ విధానంలో..


ఏడాదికి రెండు సార్లు ఈ పరీక్ష జరుగుతుంది. తొలి విడత పరీక్షకు ఏప్రిల్ 20 నుంచి మే 0 వరకూ దరఖాస్తులు స్వీకరించగా జూన్ 18న 12 వందల కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష జరిగింది. కానీ పరీక్ష జరిగిన 24 గంటల్లోనే పేపర్ లీక్ ఆరోపణలతో ఆ పరీక్ష రద్దయింది. ఈసారి ఎలాంటి అవకతవకలు జరగకూడదనే ఉద్దేశ్యంతో ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. 


యూజిసి నెట్ పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. రెండూ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఉంటాయి. పేపర్ 1 లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. మొత్తం 3 గంటల వ్యవధి ఉంటుంది. మరిన్ని ఇతర వివరాల కోసం అభ్యర్ధులు ఎన్డీఏ అధికారిక వెబ్‌సైట్ nta.ac.in సందర్శించాల్సి ఉంటుంది. 


Also read: Best Geyser Deals: గీజర్ కొనే ఆలోచనలో ఉన్నారా, 4 వేల బడ్జెట్‌లో 5 బెస్ట్ ఇన్‌స్టంట్ గీజర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook