Union Budget 2021 live updates: పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, బ్యాంకుల నిరర్ధక ఆస్తుల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బడ్జెట్‌ కీలకాంశాలివే.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Union Finance minister Nirmala sitaraman ) బడ్జెట్ ప్రసంగం ( Budget Speech ) పార్లమెంట్ ( Parliament )‌లో కొనసాగుతోంది. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని నిర్ణయించారు. రెండు ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవడం, ఎల్ఐసీ ప్రైవేటీకరణ పూర్తి చేస్తామన్నారు.  బడ్జెట్ ( Union Budget 2021 )‌లో కీలకమైన అంశాలు ( Union Budget 2021 live updates )..


ఇన్వెస్టర్ రక్షణ కోసం కొత్త ఇన్వెస్టర్ ఛార్టర్ ఏర్పాటు


బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి పెంపు,  2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ


2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు, రక్షిత మంచినీటి పథకాల కోసం 87వేల కోట్లు


- 2 కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు, జల జీవన్‌ మిషన్‌కు 2 లక్షల 87 వేల కోట్లు కేటాయింపు


కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం 35 వేల 400 కోట్లు, మెగా ఇన్వెస్ట్‌మెంట్‌  టెక్స్‌టైల్‌ పార్క్‌


-  కొత్తగా బీఎస్‌ఎల్‌-3  ప్రయోగశాలలు 9 ఏర్పాటు,


వాహనాలు 20  ఏళ్లు దాటితే ఇక స్క్రాప్‌కే..వాహన పొల్యూషన్‌ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి 


- పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం, వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ


ఆత్మనిర్భర్‌ యోజన పథకం, 64 వేల 150 కోట్లతో ఆత్మనిర్భర భారత్‌ :  రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం


6 సంవత్సరాలకు గాను  64వేల 180కోట్లరూపాయలతో  ఆత్మనిర్భర్‌ యోజన పేరుతో కొత్త పథకం


నేషనల్‌ డిసిజ్‌ కంట్రోల్‌ సిస్టం మరింత పటిష్టం, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు 


100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం, కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం


-ఎల్ఐసీ పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ


- రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణ


- అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనాల అమలు


- బెంగాల్, అస్సోలలో తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల కోసం వేయి కోట్లు కేేటాయింపు


- గోవా డైమండ్ జూబ్లీ సెలెబ్రేషన్స్ కోసం 3 వందల కోట్లు కేటాయింపు


- ఆర్ధిక రంగ పునరుత్తేజానికి 80 వేల కోట్లు కేటాయింపు


-  దేశంలో నాలుగు సెంటర్లలో వైరాలజీ ల్యాబ్‌ల ఏర్పాటు


Also read: Budget Expectations 2021: బడ్దెట్‌లో దేనికి ప్రాధాన్యత..నిర్మలా సీతారామన్ ఏమన్నారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook