Budget 2023: అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి ఎవరో తెలుసా..? రికార్డు ఆయన పేరు మీదే..
Union Budget 2023: వచ్చే నెల 1న నిర్మలా సీతారామన్ ఈసారి ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఎన్నో ఆశలు ఉన్నాయి. అయితే ఓ మంత్రి అత్యధికంగా 10 సార్లు బడ్జెట్‌ను రికార్డు సృష్టించారు. ఆయన రికార్డును ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేదు.
Union Budget 2023: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఐదోసారి బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్‌పై ఉద్యోగ నిపుణుల నుంచి రైతుల వరకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరు మీద ఉంది. ఆయన దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 13 మార్చి 1958 నుంచి 29 ఆగస్టు 1963 వరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇందులో రెండుసార్లు మధ్యంతర బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టారు.
మొరార్జీ దేశాయ్ ఫిబ్రవరి 29న పుట్టారు. ఆయన పుట్టినరోజు నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది. తన పుట్టినరోజు నాడు 1964, 1968లో బడ్జెట్‌ను సమర్పించారు. పుట్టిన రోజున బడ్జెట్‌ను సమర్పించడం కూడా ఓ రికార్డు. గతంలో దేశ బడ్జెట్ ఫిబ్రవరి చివరి తేదీన సమర్పించేవారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆరు సార్లు, ఉప ప్రధానిగా ఉన్నప్పుడు నాలుగు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఆర్థిక మంత్రి శాఖ బాధ్యతలు నిర్వహించిన తరువాత మొరార్జీ దేశాయ్ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన తరువాత మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అత్యధికంగా 9 సార్లు బడ్జెట్‌ను సమర్పించారు. 1996 నుంచి 21 ఏప్రిల్ 1997 వరకు తొలిసారిగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మే 1997 నుంచి మార్చి 19, 1998 వరకు ఇంద్ర కుమార్ గుజ్రాల్ కాలంలో ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని 2004, 2009లో యూపీఏ-1, యూపీఏ-2లో ఆయన ఆర్థికశాఖ మంత్రిగానే పనిచేశారు.
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె వరుసగా ఐదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జూలై 2019లో తొలిసారిగా బడ్జెట్‌ను సమర్పించిన సీతారామన్.. ఇప్పటివరకు బడ్జెట్‌ను సమర్పించిన ఇద్దరు మహిళల్లో ఒకరు. ఈ ఏడాది సీతారామన్ 33వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Also Read: Maharashtra Road Accident: మహారాష్ట్రలో రెండు ఘోర ప్రమాదాలు.. 13 మంది మృతి
Also Read: Hardik Pandya: థర్డ్ అంపైర్ కళ్లు మూసుకున్నారా..? పాండ్యా ఔట్‌పై వివాదం.. ఇషాన్ కిషన్ రివేంజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook