Fuel prices:దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలపై విధించిన పన్నుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాల్సిన అవసరం ఉందా..మంత్రి ఈ అంశంపై ఏమన్నారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో గత కొద్దిరోజులుగా ఇంధన ధరలు (Fuel prices)విపరీతంగా పెరిగిపోతూ..సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై విధించిన పన్నుల్ని తగ్గించాలని అన్నివర్గాల్నించి ఒత్తిడి పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. చాలా రాష్ట్రాల్లో సెంచరీకు చేరువలో ఉంది. ఈ నేపధ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra pradhan)కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమేనని కేంద్ర మంత్రి తెలిపారు. ఇంధన ధరలపై విధించిన పన్నుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా తగ్గించాల్సిన అవసరముంది. అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఇండియాలో ధరల్ని పెంచవలసి వచ్చిందన్నారు. త్వరలోనే ధరలు క్రమం తగ్గుతాయని స్పష్టం చేశారు. 


ఇదే అంశంపై ఈ నెల ప్రారంభంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitaraman) కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోలియం ధరపై కేంద్ర మాత్రమే సుంకాలు విధించడం లేదని..రాష్ట్రాలు కూడా పన్నులు విధిస్తున్నాయని చెప్పారు. ఈ నేపధ్యంలో ధరల తగ్గుదలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకోవాలన్నారు. కేంద్రానికి వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకు తిరిగి వెళ్తుందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించడం కోసం ఇంధనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధించాయి.


Also read: EPFO Loans: ఈపీఎఫ్ నుంచి హోమ్‌లోన్, పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలో తెలుసా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook