EPFO Loans: ఈపీఎఫ్. ఉద్యోగుల భవిష్య నిధి. ఈ మధ్యకాలంలో వివిధ రకాల పథకాలు, సౌకర్యాలతో ఖాతాదారులకు చేరువగా ఉన్న ఈపీఎఫ్..మరో సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. హోమ్‌లోన్, పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO )దేశవ్యాప్తంగా ఆరు కోట్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల నగదు నిల్వ, వడ్డీ, పన్ను మినహాయింపు, పింఛన్ వంటి సౌకర్యాల్ని అందిస్తోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్తో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తోంది. తాజాగా 2019-20 ఆర్ధిక సంవత్సరానికి 8.5 వడ్డీ అందించింది. ఇప్పుడు మరో సరికొత్త సౌకర్యాన్ని ప్రవేశపెడుతోంది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఇక నుంచి హోమ్‌లోన్, పర్సనల్ లోన్ కూడా పొందే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదు మీ వివాహం, కొడుకు లేదా కుమార్తె వివాహం వంటి వాటికి కూడా లోన్ తీసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. వివిధ రకాల రుణాల్ని తీసుకునే సౌకర్యాలున్నాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు గృహ రుణాలు (Epfo home loans), వ్యక్తిగత రుణాలు ఎలా తీసుకోవాలంటే..
ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ( EPFO Website) లో యూఏఎన్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన కావల్సి ఉంటుంది. తరువాత మేనేజ్ సెక్షన్‌కు వెళ్లి..మీ ఆధార్ కార్డు నెంబర్, బ్యాంకు ఖాతా వంటి కేవైసీ వివరాల్ని వెరిపై చేసుకోవాలి. ఆన్లైన్ సర్వీసెస్‌కు వెళ్లి..అందులో క్లెయిమ్ ఫార్మ్ 31,19,10సీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత ఈపీఎఫ్ ఖాతాదారుడి వివరాలు కన్పిస్తాయి. మీ బ్యాంకు ఖాతాలోని చివరి 4 అంకెలు ఎంటర్ చేయాలి. అనంతరం వెరిఫై ఆప్షన్ క్లిక్ చేయాలి. అనంతరం మీ వివరాల్ని నమోదు చేశాక..ఎస్ ఆప్షన్ ఓకే చేయాలి. తరువాత ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అప్షన్ ఎంచుకోవాలి. తరువాత I want to apply for ఆప్షన్ క్లిక్ చేయాలి. లోన్ తీసుకునే కారణం, ఎంత నగదు కావాలనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తరువాత ఎంప్లాయర్ ఆమోదం తెలిపితే 15-20 రోజుల్లో ఈపీఎఫ్ ఖాతాదారులు అక్కౌంట్ కు నగదు జమ అవుతుంది.
Also read: Maharashtra: మాట వినకపోతే మహారాష్ట్రలో లాక్డౌన్ తప్పదని హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook