Lockdown in India 2022: దేశంలో మరోసారి లాక్​డౌన్​ విధించిననున్నారనే వార్తలపై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పై పూర్తి అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే వారి వారి రాష్ట్రాల్లో ఏర్పడిన పరిస్థితులను బట్టి లాక్ డౌన్ లేదా కరోనా ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు లాక్ డౌన్ విధించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి.. లాక్ డౌన్ పై నిర్ణయాన్ని ప్రకటిస్తారని అభిప్రాయపడ్డారు. 


గాంధీ ఆస్పత్రి సందర్శన


సోమవారం సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. కొవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. దేశంలో కరోనా మూడో వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో.. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రాణాపాయం లేదని ఆయన చెప్పారు. 


టీకాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మొద్దని కిషన్ రెడ్డి సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న యువత దేశంలో 8 కోట్ల మంది ఉన్నారని.. వారిలో ఇప్పటికే 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్​ పూర్తయినట్లు చెప్పారు. దేశంలో 150 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్​ పూర్తైందన్నారు. దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాలైనా కొవిడ్ మెడిషన్, ఎక్విప్​మెంట్​ ఎగుమతులను నిలిపివేసినట్లు చెప్పారు.  


Also Read: Telangana Weather Report: తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు- వాతావరణ కేంద్రం హెచ్చరిక


Also Read: KTR reacting on Rythu Bandhu : వ్య‌వ‌సాయ చ‌రిత్ర‌లోనే సువ‌ర్ణ అధ్యాయం లిఖించాం.. మాపై విమర్శాలా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి