Pralhad Joshi: మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
భారత్‌లో కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులకు సైతం కరోనా మహమ్మారి సోకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కేంద్రమంత్రి కరోనా బారినపడ్డారు.
Pralhad Joshi tested Covid-19 positive: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులకు సైతం కరోనా మహమ్మారి సోకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కేంద్రమంత్రి కరోనా బారినపడ్డారు. కర్ణాటక (Karnataka) బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ( Pralhad Joshi ) కి కరోనా సోకింది. బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు. తాను కరోనా బారినపడ్డానని.. తాజాగా చేయించుకున్న పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు కేంద్ర ప్రహ్లాద్ జోషి తెలిపారు.
ఇదిలాఉంటే.. ధర్వాడ్ (Dharwad) లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రహ్లాద్ జోషి.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రిగా ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన సోమవారమే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా సుందరకాండ పఠనంలోనూ ఆయన పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఒకరోజు తర్వాత కేంద్ర మంత్రికి పాజిటివ్‌గా తేలడంతో.. టీటీడీ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. Also read: Fake universities list: 24 నకిలీ విశ్వవిద్యాలయాలను గుర్తించిన యూజీసీ
ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ప్రతిపక్ష నేత సిద్దరామయ్యతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరోనా బారినపడ్డారు. అంతేకాకుండా కర్ణాటకకు చెందిన మరో కేంద్రమంత్రి సురేష్ అంగడి కరోనా బారినపడి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు బీజేపీ రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తి, బసవకల్యాణ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ. నారాయణ రావు కూడా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. Also read : US H-1B Visa Rules: మరింత కఠినంగా హెచ్1బీ వీసా కొత్త రూల్స్