Union Minister Smriti Irani warns Andhra Pradesh government on name changes of the central schemes: కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సీరియస్ అయ్యారు. రాష్ట్రాలు తమకు నచ్చినట్టు పథకాలకు పేర్లు మార్చకోవడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్ర పథకాలకు ఆంధ్రప్రదేశ్‌లో పేర్లు మార్చడంపై స్మృతి ఇరానీ (Union Minister Smriti Irani) అభ్యంతరం తెలిపారు. ఏపీలో జగనన్న గోరుముద్ద, జగనన్న పాల వెల్లువ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అనే పేర్లు పెట్టడాన్ని కేంద్రం తప్పు పట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు 2021,22 ఆర్థిక సంవత్సరానికిగానూ ఐసీడీఎస్.. ఐసీపీఎస్‌ పథకాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.187 కోట్లకు సంబంధించిన లెక్కల్ని చూపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చారంటూ... కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghu Rama Krishna Raju) ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే స్మృతి ఇరానీ స్పందించారు. 


Also Read : Pushpa: 26 సెకన్లలో 'పుష్ప' స్టోరీ చెప్పేసిన ట్రైలర్ టీజ్.. డిఫరెంట్ మ్యానేరిజంతో ఐకాన్ స్టార్ అదుర్స్..


కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే పేర్లు మార్చితే కుదరదని స్పష్టం చేశారు. ఏపీలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్‌కు (central schemes) సీఎం జగన్‌ (AP CM YS Jagan) పేర్లు పెట్టడంపై నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇక రఘురామకృష్ణరాజు కేంద్రానికి రాసిన లేఖకు సమాధానం ఇవ్వాలని.. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు స్మృతి ఇరానీ (Smriti Irani)తెలిపారు. 



Also Read : Bheemla Nayak Song Update: ‘భీమ్లా నాయక్’ నుంచి మరో అప్డేట్.. ‘అడవి తల్లి మాట’ సాంగ్ రిలీజ్ ఫిక్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి