Fake Universities: ఆ 20 యూనివర్శిటీలు నకిలీ, తేల్చిచెప్పిన యూజీసీ
Fake Universities: మీరు ఆ యూనివర్శిటీల్లో చదువుకున్నారా..అయితే మీ చదువు ప్రమాదంలో పడిపోయినట్టే. కష్టపడి చదివిందంతా వృధా. బూడిదలో పోసిన పన్నీరే. అదేంటని ఆందోళనలో పడ్డారా..నిజమే మరి. పూర్తి వివరాలు మీకోసం..
Fake Universities: దేశంలో లెక్కకు మించి యూనివర్శిటీలున్నాయి. ఇందులో చాలావరకూ నకిలీ యూనివర్శిటీలే. యూజీసీ ఇప్పుడు జారీ చేసిన జాబితా చూస్తే ఆందోళన చెందక తప్పదు. ఏవి నకిలీ ఏవి కావనేది యూజీసీ తేల్చేసింది. యూజీసీ జాబితాను ఓసారి పరిశీలిద్దాం..
దేశంలో యూనివర్శిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అనుమతి ఉన్నా లేకున్నా యూనివర్శిటీ హోదాతో చెలరేగిపోతున్నాయి. విద్యార్ధుల భవిష్యత్‌ను పణంగా పెడుతున్నాయి. దేశంలో ఫేక్ యూనివర్శిటీలు ఏకంగా 20 ఉన్నాయని యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ తాజాగా వివరించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవి కూడా కొన్ని ఉండటం గమనార్హం. ఈ యూనివర్శిటీల్లో చదివినవారి సర్ఠిఫికేట్లు చెల్లవని కూడా స్పష్టం చేసింది. యూజీసీ చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఈ సంస్థలు డిగ్రీలు కూడా అందిస్తున్నట్టు యూజీసీ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ తరహా యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలను గుర్తించమని యూజీసీ వెల్లడించింది.
దేశంలో ఫేక్ యూనివర్శిటీల జాబితాను విడుదల చేసింది. కేంద్రం లేదా రాష్ట్ర చట్టాల ప్రకారం ఏర్పడిన యూనివర్శిటీలు లేదా డీమ్డ్ వర్శిటీలకు మాత్రమే అనుమతి ఉంటుందని..అవి జారీ చేసే డిగ్రీలకే అర్హత ఉంటుందని తేల్చింది.
ఒక్క ఢిల్లీలోనే 8 ఫేక్ యూనివర్శిటీలు
1. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్
2. కమర్షియల్ యూనివర్శిటీ లిమిటెడ్, దర్యాగంజ్
3. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం
4. వొకేషనల్ యూనివర్సిటీ
5. ఏడీఆర్-సెంట్రిక్ జురిడికల్ యూనివర్శిటీ
6. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
7. విశ్వకర్మ ఓపెన్ యూనివర్శిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్
8. ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ
ఢిల్లీలో 8 యూనివర్శీటీలతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు నకిలీ యూనివర్శిటీలున్నాయి. ఇందులో గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్శిటీ, భారతీయ శిక్షా పరిషత్ ఉన్నాయి.
ఇక ఏపీలో కూడా రెండు ఫేక్ వర్శిటీలున్నాయి. గుంటూరులోని కాకుమానువారి తోటలో క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్శిటీ, విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
ఇక పశ్చిమ బెంగాల్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, బదగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, సెయింట్ జాన్స్ యూనివర్శిటీ కేరళ, రాజా అరబిక్ యూనివర్శిటీ. శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పుదుచ్చేరి ఉన్నాయి.
Also read: Toll Plaza: టోల్‌ప్లాజాల్లో కొత్త విధానం, ఇక ఆగాల్సిన పనిలేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook