Toll Plaza: టోల్‌ప్లాజాల్లో కొత్త విధానం, ఇక ఆగాల్సిన పనిలేదు

Toll Plaza: టోల్‌ప్లాజా. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు చెల్లించాల్సిన రుసుము. పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్. ఫాస్ట్‌టాగ్ విధానంతో ఆ సమస్యకు చాలా వరకూ చెక్ పడినా ఇంకా పూర్తిగా తొలగని పరిస్థితి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 2, 2023, 07:27 PM IST
Toll Plaza: టోల్‌ప్లాజాల్లో కొత్త విధానం, ఇక ఆగాల్సిన పనిలేదు

Toll Plaza: టోల్‌ప్లాజా రద్దీ నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చాక టోల్‌ప్లాజా రద్దీ చాలావరకూ తగ్గినా పండుగలు వంటి సందర్భాల్లో ఇంకా రద్దీ కన్పిస్తూనే ఉంది. ఇప్పుడిక టోల్‌ప్లాజా రద్దీని పూర్తిగా జీరో చేసేందుకు కొత్త విధానం ప్రవేశపెట్టబోతోంది.

టోల్‌ప్లాజా విషయంలో కొత్త విధానం అమల్లోకి వస్తే ఇక ఏ వాహనం కూడా ఆగాల్సిన పనిలేదు. టోల్‌ప్లాజాను దాటుకుని యధేఛ్చగా ముందుకు పోవచ్చు. ఇప్పుడున్న ఫాస్టాగ్ విధానం స్థానంలో కొత్త విధానం ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మరో ఆరు నెలల్లో కొత్త విధానం ప్రవేశపెడతామని కేంద్ర రవాణా శాక మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫాస్టాగ్ విధానానికి ముందు ప్రతి వాహనం టోల్‌ప్లాజా వద్ద ఆగడం, నిర్ణీత రుసుము చెల్లించాక రసీదు తీసుకుని వెళ్లడం జరిగేది. దీనివల్ల ప్రతి వాహనం టోల్‌ప్లాజా దాటేందుకు కనీసం 2-3 నిమిషాలు పట్టేది. దీనికి ప్రత్యామ్నాయంగా ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో ప్రతి వాహనానికి ఓ ఫాస్టాగ్ స్టిక్కర్ అంటించి ఉంటుంది. ఈ స్టిక్కర్ క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో సంబంధిత బండి రిజిస్టేషన్ నెంబర్‌తో అనుసంధానమై..ప్రత్యేక వ్యాలెట్ ఉంటుంది. ఈ వ్యాలెట్‌లో డబ్బులు రీఛార్జ్ చేయించుకుంటే..అందులోంచి టోల్‌ప్లాజా రుసుము కట్ అవుతుంటుంది. ఈ విధానం ప్రవేశపెట్టాక టోల్ ప్లాజా రద్దీ చాలావరకూ తగ్గిపోయింది. ఒక్కొక్క వాహనానికి 2-3 నిమిషాలకు బదులు కేవలం 40-50 సెకన్లు పట్టే పరిస్థితి వచ్చేసింది. 

ఇప్పుడు మరో కొత్త విధానం ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విధానంలో టోల్‌ప్లాజాలు యధావిధిగా ఉంటాయి కానీ వాహనం ఆపాల్సిన అవసరం లేదు. ఏదైనా వాహనం టోల్‌ప్లాజా దాటేటప్పుడు అక్కడుండే అత్యాధునిక కెమేరాలు బండి నెంబర్ ప్లేట్‌ను స్కాన్ చేస్తాయి. వెంటనే శాటిలైట్ ద్వారా సర్వర్‌కు సమాచారం చేరి టోల్ ఛార్జ్ కట్ అవుతుంది. ఈ కొత్త విధానంలో ప్రతి టోల్‌ప్లాజాలో ఉండే నిర్ణీత రుసుము ఉండదు. జాతీయ. రహదారిపై ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ చెల్లించేలా కొత్త వ్యవస్థను రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కొత్త టోల్‌ప్లాజా విధానాన్ని ప్రయోగాత్మకంగా ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌పై పరీక్షించనున్నారు. 

Also read: Maruti Brezza: మారుతి బ్రిజా కొనే ఆలోచన ఉందా..ఇదే మంచి అవకాశం, కేవలం 5 లక్షలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News