UP minister Dies of Corona: లక్నో: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రతీరోజు వందలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. సాధరణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం దీనిబారిన పడి బలవుతున్నారు. కరోనా కారణంగా తాజాగా ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh ) కేబినెట్ మంత్రి కమల్‌రాణి వరుణ్ ( Kamal Rani Varun ) కన్నుమూశారు. 62ఏళ్ల కమల్ రాణి లక్నోలోని సంజయ్ గాంధీ మెడికల్ ఆసుపత్రిలో గత కొన్నిరోజులుగా కరోనాతో పొరాడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. అయితే కమల్‌రాణి యూపీ కాన్పూర్ జిల్లాలోని ఘాతంపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె యూపీ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకు మందు ఆమె లోక్‌సభకు కూడా రెండుసార్లు ఎన్నికై సేవలందించారు. Also read: Pingali Venkayya: తెలుగువారి ఆత్మగౌరవం.. పింగళి వెంకయ్య


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జులై 18న కమల్‌రాణికి కరోనా నిర్థారణ కాగా.. లక్నోలని కోవిడ్ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ పెరగడంతో మంత్రి ఆరోగ్యం బాగా క్షీణించిందని.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 


ఇదిలాఉంటే.. కమల్‌రాణి మరణవార్త తెలియగానే యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసి.. ఆమె కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు. మంత్రిగా, రాజకీయ నాయకురాలుగా ఆమె సమాజానికి ఎంతో మేలు చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే.. ఆగస్టు 5న జరగనున్న రామమందిర భూమి పూజ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించడానికి ఆయన ఈ రోజు అయోధ్య వెళ్లాల్సి ఉంది. కానీ మంత్రి మరణ వార్త తెలియగానే సీఎం ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఆర్జీవీ నెక్ట్స్ మూవీ ‘Allu’.. మళ్లీ రచ్చ రచ్చే!