స్మశానంలో మృత్యువు అవహించింది. అంత్యక్రియలు జరిగే చోటే ప్రాణాలు పోయాయి. ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) ఘజియాబాద్ ( Ghaziabad )‌లో స్మశానంలో మృత్యువు ఆవహించింది. స్మశానంలో నిర్మాణంలో ఉన్న షెల్టర్ కూలిపోవడంతో..15 మంది మరణించారు. ఇతరులు గాయపడ్డారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ( Up Cm Yogi Adityanath ) సంఘటనపై విచారం వ్యక్తం చేసి..పరిహారం ప్రకటించారు.


ఢిల్లీ ( Delhi ) కు అనుకుని ఉన్న యూపీ ఘజియాబాద్‌లో దయనీయమైన ఘటన జరిగింది. ఘజియాబాద్ మురాద్‌నగర్‌లో స్మశాన‌ఘాట్‌లో పరిసరాల్లో జనం సౌకర్యార్ధం పక్కా షెల్టర్ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా స్లాబ్ నిర్మితమవుతోంది. దురదృష్టవశాత్తూ ఆదివారం నాడు రామ్‌ధన్ అనే వ్యక్తి దహన సంస్కారాల ( Cremations ) కోసం చాలామంది చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో నిర్మాణంలో కప్పు కిందకు జనం చేరుకున్నారు. భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా పై కప్పు కూలిపోవడంతో ( Roof Collapsed )..17 మంది అక్కడికక్కడే మరణించారు. మిగిలినవారికి గాయాలయ్యాయి. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ప్రారంభించారు. గాయపడినవారిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. స్మశాన ఘటనపై దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. 


Also read: Road Accident: పెళ్లి బస్సు బోల్తా.. ఏడుగురు మృతి