UP elections 2022: యూపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ నేతలు ఎస్పీలో చేరడం చూశాం. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ(SamajWadi Party)కి పెద్ద షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) కోడలు అపర్ణా యాదవ్ (Aparna Yadav) భారతీయ జనతా పార్టీలో చేరారు. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్‌ సతీమణి అపర్ణ యాదవ్‌. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేతలు ఆమెకు కండువా కప్పి భాజపాలోకి (BJP) ఆహ్వానించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇప్పటికే మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ సహా పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసి ఇటీవల సమాజ్​వాదీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 2017లో జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (UP elections 2022)సమాజ్​వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు అపర్ణ యాదవ్‌. కానీ, భాజపా అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓటమిపాలయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలను వెల్లడించనున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.


 


Also Read: UP Polls 2022 : తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో సీఎం యోగి... పోటీ అక్కడి నుంచే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి