Uttar Pradesh: పర్ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.150 కోట్లు స్వాధీనం!
UP: పన్ను ఎగవేతకు పాల్పడిన ఓ వ్యాపారి ఇంట్లో రూ.150 కోట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.
IT Raids recover ₹150 cr from businessman: దేశంలో మరో భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. కాన్పుర్(Kanpur)కు చెందిన పీయూష్ జైన్ అనే వ్యాపారి నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లుల ద్వారా పన్ను ఎగవేత (tax evasion)కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అతడి నుంచి రూ.150 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
కాన్పూర్‌కు చెందిన ఓ పర్ఫ్యూమ్ తయారీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో..ఆ సంస్థ యజమాని పీయూష్ జైన్(Piyush Jain) ఇంటికి గురువారం ఉదయం ఐటీ అధికారులు వెళ్లారు. ఆయన ఇంట్లో సోదాలు (Incom Tax Raids) నిర్వహించారు. అంతలో అనుమానం వచ్చిన రెండు బీరువాలను తెరిపించగా..ఆశ్యర్యపోవడం వారి వంతైంది. బీరువాల్లోని నోట్ల కట్టలు చూసి వారు షాక్ తిన్నారు. బ్యాంక్ అధికారులను పిలిపించి నోట్లను లెక్కించగా...రూ.150కోట్లగా లెక్క తేలింది. పీయూష్ జైన్ ఇంట్లో మూడు నోట్ల లెక్కింపు యంత్రాలను కూడా అధికారులు గుర్తించారు.
Also Read: Ludhiana Blast: కోర్టు కాంప్లెక్స్‌లో భారీ పేలుడు- ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు!
ఈ కేసుకు సంబంధించి కాన్పుర్ సహా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, గుజరాత్, ముంబయిల్లో కూడా అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. పీయూష్ జైన్ వ్యాపారి మాత్రమే గాక, సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) నేత కూడా. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ పేరుతో పీయూష్ ఓ ప్రత్యేక పర్ఫ్యూమ్ (Perfume)ను కూడా తయారు చేశారు. మరో నాలుగు నెలల్లో యూపీ ఎన్నికల ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ నేత పన్నుఎగవేతకు పాల్పడటం...రానున్న రోజుల్లో రాజకీయ కలకలం సృష్టించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook