Ludhiana Blast: కోర్టు కాంప్లెక్స్​లో భారీ పేలుడు- ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు!

Ludhiana Blast: లుథియానాలో భారీ పేలుడు సంభవించింది. జిల్లా కోర్టు కాంప్లెక్స్​​లో ఈ పేలుడు జరిగింది. పేలుడుకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 03:06 PM IST
  • లుథియానా కోర్టు కాంప్లెక్స్​లో​ పేలుడు కలకలం
  • ఇద్దరు మృతి, పలువురుకి తీవ్ర గాయాలు
  • ఘటన స్థలానికి బయల్దేరిన పంజాబ్ సీఎం
Ludhiana Blast: కోర్టు కాంప్లెక్స్​లో భారీ పేలుడు- ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు!

Ludhiana Blast: పంజాబ్​లోని లుథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్​లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. జిల్లా కోర్టు కార్యకలాపాలు సాగుతున్న క్రమంలోనే.. మధ్యాహ్నం 12:22 గంటల ప్రాంతంలో ఈ పేలుడు (Ludhiana Court Complex Blast) సంభవించింది.

పేలుడు తీవ్రతకు బాత్రూమ్ గోడలు ధ్వంసమయ్యాయి. సమీపంలోని గదులకు అద్దాలు పగిలిపోయాయి. పేలుడు కారణంగా శిథిలాలు ఎగిరి వెలుపల ఉన్న వాహనాలపై పడ్డాయి.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కోర్టు కాంప్లెక్స్ వద్దకు చేరుకుని.. దర్యాప్తు ప్రారంభించారు. కోర్టు కాంప్లెక్స్​లోని రెండో అంతస్తులో పేలుడు శబ్దం వినిపించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

పేలుడుపై స్పందించిన లుథియానా పోలీస్​ కమిషనర్ గురుప్రీత్​ సింగ్ భుల్లర్​.. ఆ ప్రాంతాన్ని సీజ్​ చేశామని చెప్పారు. ఆ ప్రాంతాల్లో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. చండీగఢ్​ నుంచి బాంబ్​ స్క్వాడ్​ను పిలిపించామని.. ఎవరూ బయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

సీఎం ఏమన్నారంటే..

పేలుడు నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు లుథియానా బయల్దేరారు పంజాబ్​ సీఎం చరణ్​జీత్​ సింగ్​ చన్నీ. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సంఘ విద్రోహ ఇలాంటి ఘటనలకు తెగబడుతున్నాయన్నారు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని.. దాడులకు తెగబడిన వారికి కఠిన శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

Also read: Murder: మైనర్ బాలుడి దారుణ హత్య-కాళ్లు చేతులు కోసి సంచిలో మూటగట్టి..

Also read: Omicron Cases in Tamilnadu: తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News