MLAS IN ASSEMBLY: తంబాక్ తింటూ ఒకరు.. కార్డ్స్ గేమ్ లో మరొకరు! అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల బాగోతం..
MLAS IN ASSEMBLY: అసెంబ్లీ అంటే పాలకులు చట్టాలు చేసే పవిత్ర సౌదం. ప్రజల చేత ఎన్నికోబడిన ప్రజా ప్రతినిధులు పాలనకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే వేదిక.అలాంటి చట్టసభలు ఇటీవల కాలంలో వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నాయి.
MLAS IN ASSEMBLY: అసెంబ్లీ అంటే పాలకులు చట్టాలు చేసే పవిత్ర సౌదం. ప్రజల చేత ఎన్నికోబడిన ప్రజా ప్రతినిధులు పాలనకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే వేదిక. ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం. అలాంటి చట్టసభలు ఇటీవల కాలంలో వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నాయి. గౌరవప్రదమైన హోదాలో ఉన్న నేతలు.. చట్టసభల్లో చిల్లరగా వ్యవహరిస్తూ పరువు తీస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలోని చట్ట సభల్లోనూ చిల్లర వ్యవహారాలే కనిపిస్తున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి వెలుగుచూసిన ఘటనలు అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలో చేస్తున్న నిర్వాకం చూసి జనాలు ఫైరవుతున్నారు.
యూపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల తీరు విమర్శల పాలైంది. సభలో కీలక చర్చ సాగుతుండగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియోలను ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మొదటి వీడియోలో.. సభ కార్యాక్రమాలను పట్టించుకోకుండా మొహబా ఎమ్మెల్యే రాకేశ్ గోస్వామి తన మొబైల్ ఫోన్‌లో కార్డ్స్ గేమ్ ఆడుతున్నారు. చాలా సీరియస్ గా ఆయన గేమ్ ఆడుతున్నారు. సభలో సభ్యులంతా చప్పట్లు కొడుతున్న శబ్దాలు వస్తున్నా రాకేశ్ గోస్వామి మాత్రం గేమ్ నుంచి బయటికి రాలేదు. రెండో వీడియోలో ఝాన్సీ ఎమ్మెల్యే రవి శర్మ సభలో దర్జాగా పోగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. తన సీటు దగ్గర ఉన్న డెస్కు నుంచి రాజ్‌నిగంధ బాక్స్‌ను బయటకు తీసి చేతిలో వేసుకుని నలిపి నోట్ల వేసుకుంటున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది.
ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల బాగోతాన్ని బయటపెడుతూ ఘాటు వ్యాఖ్యలు చేసింది సమాజ్ వాదీ పార్టీ. ఈ ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలకు సమాధానం చెప్పరు. అసెంబ్లీని ఒక వినోద హబ్‌గా మార్చేశారని కామెంట్ చేసింది. ఇది చాలా నీచమైన, అవమానకరమైన చర్య అంటూ మండిపడింది. సమాజ్‌వాది పార్టీ షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఘాటు కామెంట్లు చేస్తూ వాళ్లను ఆటాడుకుంటున్నారు.
Also Read: China President House Arrest: చైనాలో సైనిక తిరుగుబాటు? అధ్యకుడు జిన్ పింగ్ హౌస్ అరెస్ట్?
Also Read: Pawan Kalyan: అమెరికాలో పవన్ కల్యాణ్ సీక్రెట్ మీటింగ్స్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి