Bride Refuses Bald Groom: 'బట్టతల' అతని పెళ్లి పెటాకులయ్యేలా చేసింది. సరిగ్గా పెళ్లికి కొద్ది నిమిషాల ముందే సదరు వరుడి బట్టతల సీక్రెట్ బయటపడిపోయింది. దీంతో వధువు తనకీ పెళ్లి వద్దని... బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పింది. ఎంతమంది ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా... ఆఖరికి పోలీసులూ ప్రయత్నించినా ఆ వధువు తన నిర్ణయం మార్చుకోలేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉన్నావ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కొద్దిరోజుల క్రితం ఓ అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరింది. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇటీవల ఈ జంటకు పెళ్లి జరగాల్సి ఉంది. ముందు రోజే పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక పెళ్లి జరగాల్సిన రోజు వరుడు మండపానికి వచ్చే సమయంలో అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. వరుడు పెళ్లి మండపం వైపు అడుగులేస్తూ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయాడు.


ఆ సమయంలో అతను పెట్టుకున్న విగ్గు ఊడిపోయి కిందపడింది. దీంతో అతని 'బట్టతల' రహస్యం బట్టబయలైంది. వరుడికి బట్టతల ఉందనే విషయం తట్టుకోలేని వధువు... ఇక ఈ పెళ్లి తనకు వద్దే వద్దని తెగేసి చెప్పింది. ఇరువురి పెద్దలకు ఆమెకు నచ్చజెప్పినప్పటికీ లాభం లేకపోయింది. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లినా వధువు పెళ్లికి ససేమిరా అని చెప్పింది. దీంతో పెళ్లి రద్దయిపోయింది. అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగ్గా... పెళ్లి కోసం వధువు కుటుంబం ఖర్చు చేసిన రూ.5.6 లక్షలు ఇచ్చేందుకు వరుడి కుటుంబం ఒప్పుకుంది. 


బాలీవుడ్ సినిమా 'బాల'ను ఈ ఘటన గుర్తుకు తెచ్చింది. అందులో హీరో ఆయుష్మాన్ ఖురానా కూడా ఇలాగే తన బట్టతల సీక్రెట్ కాబోయే భార్యకు తెలియకుండా ఉండేందుకు నానా అవస్థలు పడుతుంటాడు. బట్టతల ఉన్నవారు భాగ్యవంతులనే సామెత తెలిసిందే.. కానీ బట్టతల ఎంత పనిచేసిందంటూ ఉన్నావ్ ఘటన గురించి తెలిసినవారు వాపోతున్నారు. 


Also Read: Four in Single Birth: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ... ఎక్కడంటే...


Also Read: Bandi Sanjay Kumar: కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ప్రస్థానానికి మూడేళ్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.