Four in Single Birth: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ... ఎక్కడంటే...

Four Child in Single Birth: కర్ణాటకకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురు పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 07:32 PM IST
  • ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
  • కర్ణాటకలోని శివమొగ్గలో ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం
  • లక్షల్లో ఒకరికే ఇలా ఒకే కాన్పులో నలుగురు పుట్టే అవకాశం ఉందంటున్న వైద్యులు
Four in Single Birth: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ... ఎక్కడంటే...

Four Child in Single Birth: కర్ణాటకలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. భద్రావతి తాలుకాలోని తడసా గ్రామానికి చెందిన అల్మాజ్ భాను (22) అనే మహిళ శివమొగ్గలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం (మే 23) ప్రసవించింది. ఒకే కాన్పులో ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు జన్మించారు. నలుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

ఇలా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించడం చాలా అరుదని... 5.12 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా నలుగురు పిల్లలు పుట్టే అవకాశం ఉందని ఆ ఆసుపత్రి వైద్యురాలు డా.చేతన పేర్కొన్నారు. జన్యుపరమైన కారణాల వల్లే నలుగురు పిల్లలు పుట్టారని తెలిపారు.ఇలా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టడం ఇదేమీ తొలిసారి కాదు. నలుగురి కన్నా ఎక్కువమందికి జన్మనిచ్చిన ఘటనలు కూడా గతంలో వెలుగుచూశాయి.

 గతేడాది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిఖిత అనే మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వైద్యులు సిజేరియన్ ద్వారా ఆమెకు ప్రసవం జరిపారు. పుట్టిన నలుగురు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఘటన జరిగిన కొన్నాళ్లకే సంగారెడ్డి జిల్లాలో బాలమణి అనే మహిళకు కూడా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. అయితే వీరిలో ఒక బాబు చనిపోగా... మిగతా ముగ్గురు పిల్లలు క్షేమంగా ఉన్నారు. 

Also Read: పట్టుమని పదేళ్లు లేవు.. తల్లిదండ్రులకే ఊహించని షాకిచ్చిన బుడతలు... ఈ అన్నాదమ్ములు మహా ముదుర్లు..  

Also Read: Errabelli On Sarpanch: సర్పంచులు రోడ్లమీదకు రావొద్దు, బిల్లులు చెల్లిస్తాం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News