Covid19 Attack: కరోనా మహమ్మారి దెబ్బకు జనం రాలిపోతున్నారు. సామాన్యులు, మధ్య తరగతి, ప్రముఖులు అందర్నీ బలి తీసుకుంటోంది. ఇప్పటికే చాలామంది రాజకీయ నేతలు కరోనా దెబ్బకు బలయ్యారు. ఇప్పుడు మరో మంత్రిని కాటేసింది కరోనా రక్కసి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా రక్కసి ఎవర్నీ వదలడం లేదు.సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మల్యేలు ఇలా ఒక్కొక్కరూ కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు మరో మంత్రిని కాటేసింది కరోనా రక్కసి. కరోనా మహమ్మారి వైరస్‌(Corona Virus)కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో మంత్రి బలయ్యారు. కరోనా సోకి..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..చివరకు కన్నుమూశారు. రాష్ట్ర రెవిన్యూ, వరద నియంత్రణ శాఖ మంత్రిగా ఉన్న విజయ్‌ కశ్యప్‌(56)..ముజఫర్‌నగర్‌ జిల్లా చర్తవాల్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు.ఇటీవల కరోనా బారిన పడ్డ విజయ్ కశ్యప్ అస్వస్థతకు గురవడంతో గుర్గావ్‌లోని వేదాంత ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి ఆరోగ్యం విషమించి..మృతి చెందారు. 


ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జేపీ నడ్డాలు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. కాగా కరోనా కారణంగా ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh)లో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు కన్నుమూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన నాయకులు ఎక్కువగా కరోనాకు బలవుతున్నారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కరోనాతో మృతి చెందారు. కశ్యప్‌తో కలిపి ముగ్గురు మంత్రులు చనిపోయారు.


Also read: India Corona Cases: భారత్‌లో రికార్డు స్థాయిలో COVID-19 మరణాలు, కానీ అదొక్కటే ఊరట


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook