11 మందిని పొట్టన పెట్టుకున్న ఘోర ప్రమాదం !!
ఉత్తర్ ప్రదేశ్‌లో శుక్రవారం దారుణమైన దుర్ఘటన చోటుచేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్‌లో శుక్రవారం దారుణమైన దుర్ఘటన చోటుచేసుకుంది. వారణాసి - లక్నో జాతీయ రహదారి రక్తమోడింది. జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన ఓ టెంపో, లారీ వేగంగా ఢీకొన్న దుర్ఘటనలో 11 మంది మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ఫాతెన్‌పూర్ పోలీసులు.. "ప్రమాదం స్థలంలో ఇద్దరు మృతిచెందగా, ఆస్పత్రికి తరలించాకా మరో తొమ్మిది మంది మృతిచెందారు" అని తెలిపారు.
ఈ దుర్ఘటనపై స్పందించిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తూ మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.