Viral Videos of Two refuses Covid Vaccination: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు (Covid 19 Vaccination) ఇటీవలే ఏడాది పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా దాదాపు 90 శాతం పైచిలుకు జనాభాకు వ్యాక్సిన్ ఫస్ట్ డోసు పూర్తయింది. వీలైనంత త్వరగా 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు విస్తృతమైన చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పటికీ కొంతమందిలో నెలకొన్న అపోహలు వంద శాతం వ్యాక్సినేషన్‌కు ప్రతిబంధకంగా మారాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో.. ఇద్దరు వ్యక్తులు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు నిరాకరిస్తూ అధికారులను ముప్పు తిప్పలు పెట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బలియా జిల్లాలోని రియోటీ గ్రామానికి చెందిన వ్యక్తి ఇప్పటికీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదనే విషయం స్థానిక హెల్త్ కేర్ సిబ్బందికి తెలిసింది. దీంతో అతని వద్దకే వెళ్లిన సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోవాలని అతన్ని కోరారు. ఆ సమయంలో పడవ నడిపేందుకు సిద్ధమవుతున్న అతను హెల్త్ కేర్ సిబ్బందిని చూసి ఆగ్రహానికి గురయ్యాడు. తాను వ్యాక్సిన్ వేయించుకోని తెగేసి చెప్పాడు. వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనని సిబ్బంది పట్టుబట్టారు.


ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు వ్యక్తి పడవ నుంచి కిందకు దిగి హెల్త్ కేర్ సిబ్బందిపై దాడికి యత్నించాడు. అధికారిని కిందపడేసి అతనితో కలబడ్డాడు. అయినప్పటికీ సిబ్బంది ఓపికగా వ్యవహరించారు. అతనికి అన్ని విధాలా నచ్చజెప్పి ఎట్టకేలకు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఒప్పుకునేలా చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




ఇదే బలియా జిల్లాలో చోటు చేసుకున్న మరో ఘటనలో... వ్యాక్సిన్ (Covid 19 Vaccination) వద్దంటూ ఓ వ్యక్తి చెట్టు పైకి ఎక్కాడు. హెల్త్ కేర్ సిబ్బందిని చూసిన వెంటనే.. పరుగున పరుగున వెళ్లి చెట్టు పైకి చేరాడు. చివరకు స్థానికుల సాయంతో అతనికి నచ్చజెప్పి చెట్టు పైనుంచి కిందకు దిగేలా చేశారు. ఆపై అతనికి వ్యాక్సిన్ ఫస్ట్ డోసు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో (Viral Video) కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Also Read: Covid 19 Endemic: ఎట్టకేలకు దేశ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కరోనా పీడ ఎప్పుడు విరగడైపోతుందో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook