UP CM Yogi Adityanath comments on love jihad: లక్నో: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో లవ్ జిహాద్ వంటి మతాంతర కార్యకలాపాలను పూర్తిగా నివారించేందుకు యోగి ప్రభుత్వం తీవ్రమైన కసరత్తులు చేపట్టింది. లవ్ జిహాద్‌కు చెక్ పెట్టేందుకు కఠినమైన చట్టాలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) తెలిపారు. ఒకవేళ వినకపోతే వారికి అంతిమ యాత్ర ముదలైనట్లేనని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. పెళ్లి కోసం మత మార్పిడి అవసరం లేదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిచ్చిన నేప‌థ్యంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మల్హానీ అసెంబ్లీ స్థానానికి నవంబర్‌ 3న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో శనివారం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో యోగి మాట్లాడారు. Also read: Doraikkannu: కరోనాతో తమిళనాడు వ్యవసాయ మంత్రి కన్నుమూత


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లవ్ జిహాద్‌ (Love Jihad) ను అరికట్టేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఈ మేరకు తమ ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని (Anti-Love Jihad law) తీసుకువస్తుందంటూ యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఆడబిడ్డల, అక్కాచెల్లెమ్మల గౌరవ మర్యాదలతో కొందరు ఆటలాడుకుంటున్నారని అలాంటి ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే రామ్‌నామ్‌ సత్య యాత్ర (అంతిమ యాత్ర) ప్రారంభిస్తామని గట్టిగా హెచ్చరించారు. దానిలో భాగస్వాములైన వారి పోస్టర్లను కూడా రోడ్ల పక్కన ఏర్పాటు చేస్తామని సీఎం పేర్కొన్నారు.