Uttarakhand CM Trivendra Singh Rawat Resigns: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా, అసలేం జరిగింది
Uttarakhand CM Trivendra Singh Rawat Resigns | ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి, అనంతరం రాజీనామా లేఖను ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్యకు మంగళవారం సమర్పించినట్లు సమాచారం.
Uttarakhand CM Trivendra Singh Rawat Resigns: ఉత్తరాఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవి నుంచి తప్పుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్యకు మంగళవారం సమర్పించినట్లు సమాచారం.
సోమవారం నాడు ఢిల్లీ వెళ్లిన సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ బీజేపీ కీలక నేతలను కలేసుకున్నారు. అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ సీఎం కుర్చీ నుంచి తప్పుకునేందుకు రావత్ నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి గమనిస్తే బీజేపీ అధిష్టానం సూచనల మేరకు త్రివేంద్ర సింగ్ రావత్(Trivendra Singh Rawat) సీఎం పదవి నుంచి తప్పుకుని, తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించేందుకు డెహ్రాడూన్ వెళ్లారు.
Also Read: SBI Annuity Scheme: ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయండి, ప్రతినెలా SBI మీకు ఆదాయాన్ని అందిస్తుంది
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లుగా లేఖను డెహ్రాడూన్‌లో గవర్నర్‌కు సమర్పించిన అనంతరం బీజేపీ సీనియర్ నేత త్రివేంద్ర సింగ్ రావత్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. Uttarakhand ప్రజలకు సేవ చేసేందుకు తనకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం పదవికి రాజీనామా చేశానని, రాజీనామా లేఖను సైతం గవర్నర్‌కు సమర్పించినట్లు తెలిపారు. తన తరువాత ఈ కీలక పదవి చేపట్టనున్న నేతకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే ఉత్తరాఖండ్ తరువాతి సీఎం ఎవరు విషయాన్ని మాత్రం రావత్ వెల్లడించలేదు.
అయితే సీఎం పదవికి ఇద్దరు సీనియర్ నేతల పేర్లు తెరమీదకి వచ్చాయి. అజయ్ భట్, అనిల్ బలూనిలకు అవకాశం దక్కనుందని వినిపిస్తోంది. వీరిద్దరూ పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనాతో ఈ ఇద్దరు కీలక నేతలకు ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం అవకాశం ఇవ్వనుందని ఆ రాష్ట్రంలో చర్చ మొదలైందని పీటీఐ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook