Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం.. ఇది నాలుగోసారి!
Vande Bharat Superfast Express hits cattle in Gujarat. గాంధీనగర్-ముంబై వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. గురువారం గుజరాత్‌లోని ఉద్వాడ మరియు వాపి స్టేషన్ల మధ్య పశువులను ఢీకొట్టింది.
Vande Bharat Superfast Express hits cattle in Gujarat: ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గాంధీనగర్-ముంబై వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. గురువారం సాయత్రం గుజరాత్‌లోని ఉద్వాడ మరియు వాపి స్టేషన్ల మధ్య పశువులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రైలు ముందు భాగానికి చిన్నపాటి డెంట్ ఏర్పడింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం అయిన తర్వాత ప్రమాదం జరగడం ఇది నాలుగోసారి కావడం విశేషం.
పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ... 'గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఉద్వాడ మరియు వాపి మధ్య లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 87 సమీపంలో సాయంత్రం 6.23 గంటలకు ఈ సంఘటన జరిగింది. ట్రైన్ ముందు భాగంలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదు. చిన్నపాటి డెంట్ ఏర్పడింది. ఈ రాత్రికి ఆ డెంట్ పూర్తవుతుంది. కొద్దిసేపు ఆగిన తర్వాత రైలు సాయంత్రం 6.35 గంటలకు తిరిగి ఆరంభం అయింది' అని చెప్పారు.
రెండు నెలల క్రితం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు ఆరంభం అయ్యాయి. ఈ రెండు నెలల్లో నాలుగు సార్లు రైలు ట్రాకుపైకి వచ్చిన పశువులను ఢీకొట్టింది. తాజాగా మరోసారి అలాంటి ఘటనే పునరావృతం అయింది. అంతకుముందు ట్రైన్ గేదెలను ఢీకొట్టింది. అప్పుడు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. అప్ప్పుడు వందేభారత్ ట్రైన్‌పై ట్రోలింగ్ నడిచింది. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ప్రమాదం జరిగిన ఒక్క రోజులోనే దీనికి మరమ్మత్తులు చేసింది రైల్వే శాఖ. సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ గాంధీ నగర్లో ఈ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. వరుసగా మూడో రోజు పెరిగిన పసిడి ధర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook