Gold Price Today 2 December 2022: బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. వరుసగా మూడో రోజు పసిడి ధరలు పెరిగాయి. బుధవారం మొదలైన పెరుగుదల.. శుక్రవారం వరకు కొనసాగింది. శుక్రవారం (డిసెంబర్ 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 48,750లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,180లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 200.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 210 పెరిగింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి.
గత నెల ఆరంభంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800లుగా ఉండగా.. ఇప్పుడు అదే 10 గ్రాముల బంగారం ధర రూ. 48,7500లు నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ ఆరంభం అవడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం 10 క్యారెట్ల 24 గ్రాముల గోల్డ్ ధర రూ. 53,330 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల్ గోల్డ్రూ. 48,800గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,330గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 48,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,180గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,550గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,050 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,800గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,230గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,180గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53,150గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,750.. 24 క్యారెట్ల ధర రూ. 53,180గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 48,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,180 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు బంగారంబాటలోనే వెండి ధర కూడా నడిచింది. శుక్రవారం (డిసెంబర్ 2) దేశీయంగా కిలో వెండి ధర రూ. 63,600లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏకంగా రూ. 2,200 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 63,600లుగా ఉండగా.. చెన్నైలో రూ. 69,800లుగా ఉంది. బెంగళూరులో రూ. 69,800గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 69,800లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 69,800ల వద్ద కొనసాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook