Varavara Rao granted bail in Bhima Koregaon Case: ముంబై: భిమా కొరెగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుకు సోమవారం బెయిల్ మంజూరైంది. భిమా కొరేగావ్ హింసకు వరవర రావు కుట్ర పన్నారనే అభియోగాల కింద ఎన్ఐఏ అప్పట్లో వరవర రావును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా నేడు ముంబై హై కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత రెండేళ్లకుపైగా కాలం నుంచి ముంబై జైల్లో ఉంటున్న వరవర రావు కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో కోర్టు ఆయనకు ఈ బెయిల్ మంజూరు చేసింది. Varavara Rao's health condition దృష్ట్యా ఆయనకు 6 నెలల పాటు మెడికల్ బెయిల్ మంజూరు చేస్తున్నట్టు బాంబై హై కోర్టు స్పష్టంచేసింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vavara Rao కు బెయిల్ మంజూరు చేసిన బాంబై హై కోర్టు... ఆయనను ముంబైలోనే ఉంటూ తదుపరి విచారణకు సహకరించాల్సిందిగా పేర్కొంది. వరవర రావు పాస్ పోర్టు NIA Court లో సమర్పించాల్సిందిగా సూచించిన హై కోర్టు.. ఆయనను ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తోటి నిందితులతో ఎటువంటి సంప్రదింపులు జరపకూడదని తేల్చిచెప్పింది. రూ.50 వేల వ్యక్తిగత పూచికత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలను సబ్మిట్ చేయాల్సిందిగా కోర్టు షరతులు విధించింది.


Also read : Personal loans: ఈజీగా పర్సనల్ లోన్స్ కావాలా ? Paytm app లో ఈ ఆప్షన్ చూడండి


2018 ఆగస్టు 28 నుంచి Varavara Rao జైల్లో ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వరవర రావుకు ఇలాంటి పరిస్థితుల్లోనూ Medical bail ఇవ్వనట్టయితే, అది Human rights తో పాటు పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసినట్టే అవుతుందని ఈ సందర్భంగా Bombay high court అభిప్రాయపడింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook