Violence in Bengal: తృణమూల్ కాంగ్రెస్ నేత  హత్యతో పశ్చిమ బెంగాల్‌లోని బీర్భమ్ జిల్లాలో హింస చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు స్థానికంగా ఉన్న ఇళ్లకు నిప్పు పెట్టడంతో 8 మంది మృతి చెందారు. మంటల్లో ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దగ్ధమైన ఇళ్లల్లోని ఒక ఇంటిలో ఏడు మృతదేహాలు బయటపడ్డాయని... మంటల్లో గాయపడిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని బెంగాల్ డీజీపీ మనోజ్ మాళవియా తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భీర్భమ్ జిల్లాలో చెలరేగిన హింసపై 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం మమతా బెనర్జీ సర్కార్‌ను ఆదేశించింది. మరోవైపు, బెంగాల్ బీజేపీ నేతలు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మమతా పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆరోపించారు. 


హింసాత్మక ఘటనలపై బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కార్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. తాజా ఘటనలు రాష్ట్రంలో హింసా సంస్కృతిని, శాంతి భద్రతల పరిస్థితిని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 8 మంది మృతి చెందారని... ఘటనపై చీఫ్ సెక్రటరీ నుంచి అత్యవసర రిపోర్ట్ కోరానని తెలిపారు. 


తృణమూల్ కాంగ్రెస్ నేత భదు షేక్ హత్యకు ప్రతీకారంగా ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బార్షల్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ భదు షేక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం (మార్చి 21) దారుణంగా హతమార్చారు. ఈ హత్యానంతరం రాంపూర్‌హట్ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. ఇదే క్రమంలో స్థానికంగా ఉన్న ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటన బెంగాల్‌లో రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. 


Also Read: Bheemla Nayak Title Song: భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ వీడియో వచ్చేసింది!


TS EAMCET and ECET schedule: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ ఖరారు... పరీక్ష తేదీలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook